Marshall HESTON 120: మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ తో మొదటి సౌండ్ బార్ లాంచ్ చేసిన మార్షల్.!

HIGHLIGHTS

Marshall HESTON 120 సౌండ్ బార్ ఇండియా తో సహా పలు దేశాల్లో ప్రవేశపెట్టింది

HESTON 120 సౌండ్ బార్ తో సౌండ్ బార్ ప్లేస్ లోకి కూడా Marshall అడుగుపెట్టింది

మార్షల్ ఈ సౌండ్ బార్ ను స్లీక్ డిజైన్ తో అందించింది

Marshall HESTON 120: మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ తో మొదటి సౌండ్ బార్ లాంచ్ చేసిన మార్షల్.!

Marshall HESTON 120: గిటార్ యాంప్స్ మరియు వింటేజ్ స్పీకర్లకు ఐకానిక్ ఆడియో బ్రాండ్ మార్షల్ ఎట్టకేలకు సౌండ్ బార్ ను రిలీజ్ చేసింది. మార్షల్ ఇప్పటి వరకు గిటార్ యాంప్స్, బ్లూటూత్ స్పీకర్లు మరియు హెడ్ ఫోన్ లను మాత్రమే అందించింది. అయితే, HESTON 120 సౌండ్ బార్ తో సౌండ్ బార్ ప్లేస్ లోకి కూడా అడుగుపెట్టింది. ఈ సౌండ్ బార్ ఇండియా తో సహా పలు దేశాల్లో ప్రవేశపెట్టింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Marshall HESTON 120: ఫీచర్స్

మార్షల్ ఈ సౌండ్ బార్ ను స్లీక్ డిజైన్ తో అందించింది మరియు ఇందులో కంప్లీట్ సెటప్ అందించింది. ఈ సౌండ్ బార్ 5.1.2 సెటప్ తో వస్తుంది. ఇందులో రెండు 2 ఇంచ్ ఉఫర్స్, రెండు 5 ఇంచ్ ఉఫర్స్, రెండు 3 ఇంచ్, రెండు 0.8 ఇంచ్ ట్వీటర్లు తో కలిపి మొత్తం 11 స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 150W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది.

Marshall HESTON 120

ఈ సౌండ్ బార్ 2 X 50W మరియు 9 x 30W సపోర్ట్ కలిగిన 11 Class D యాంప్లిఫైయర్ లు కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ Dolby Atmos మరియు DTS-X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో 3 ప్రీ సెట్ బటన్స్, వాల్యూమ్ నాబ్, BASS / TREBLE నాబ్, సోర్స్ సెలెక్ట్ చేసే నాబ్ మరియు సౌండ్ మోడ్ చేంజ్ చేసే టోగుల్ బటన్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టీవీకే కాదు ఇంటికి కూడా అందం తెచ్చే లుక్స్ తో ఉంటుంది మరియు చాలా ప్రీమియం ఫీల్ అందిస్తుంది.

ఈ మార్షల్ సౌండ్ బార్ Airplay 2, Google Cast, Spotify కనెక్ట్, Tidal కనెక్ట్ వంటి Wi Fi సర్వీస్ ఇంటిగ్రేషన్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI 2.1 eARC, 4K 120 Hz మరియు డాల్బీ విజన్, టైప్ C పోర్ట్,ఈథర్నెట్ వంటి ప్రీమియం పోర్ట్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ రూమ్ కాలిబ్రేషన్ కోసం 2 pcs లను కలిగి ఉంటుంది.

Also Read: QD-Mini LED Smart Tv లాంచ్ చేస్తున్న TCL: ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

Marshall HESTON 120: ప్రైస్

ఈ సౌండ్ బార్ ని ఇండియన్ మార్కెట్లో రూ. 1,09,999 రూపాయల MRP ధరతో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ మార్షల్ అధికారిక వెబ్సైట్ నుంచి లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo