6 వేల బడ్జెట్ ధరలో లభించే ఏకైక Dolby Atmos సౌండ్ బార్ గురించి మీకు తెలుసా.!

HIGHLIGHTS

6 వేల బడ్జెట్ ధరలో లభించే ఏకైక Dolby Atmos సౌండ్ బార్

ఈ సౌండ్ బార్ ఒకప్పుడు 9 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభించేది

ఈ సౌండ్ బార్ మీ స్మార్ట్ టీవీ కి తగిన పార్ట్నర్ గా కూడా ఉంటుంది

6 వేల బడ్జెట్ ధరలో లభించే ఏకైక Dolby Atmos సౌండ్ బార్ గురించి మీకు తెలుసా.!

6 వేల బడ్జెట్ ధరలో లభించే ఏకైక Dolby Atmos సౌండ్ బార్ గురించి మీకు తెలుసా? ఈరోజు ఆ బెస్ట్ సౌండ్ బార్ గురించి మాట్లాడుకోనున్నాము. ఈ సౌండ్ బార్ ఒకప్పుడు 9 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభించేది. అయితే, ఇప్పుడు గొప్ప డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్స్ అందుకుని కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తోంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ మీ స్మార్ట్ టీవీ కి తగిన పార్ట్నర్ గా కూడా ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా Dolby Atmos సౌండ్ బార్?

ప్రముఖ ఆడియో పరికరాల తయారీ కంపెనీ ZEBRONICS అందించిన బడ్జెట్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Jukebar 1000 ప్రస్తుతం 6 వేల బడ్జెట్ ధరలో లభిస్తున్న ఏకైక డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ గా నిలుస్తుంది. ఈ సౌండ్ బార్ ఇంత చవక ధరలో లభించడానికి కారణం దీని పై ఫ్లిప్ కార్ట్ అందించిన డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్.

ఇక ఈ సౌండ్ ప్రైస్ మరియు ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 67% భారీ డిస్కౌంట్ అందుకుంది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ రూ. 7,499 ధరకు లభిస్తుంది. అదనంగా ఈ సౌండ్ బార్ పై SBI క్రెడిట్ కార్డు తో 10% అంటే, రూ. 749 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ డిస్కౌంట్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,750 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను 6 వేల బడ్జెట్ లో లభించే ఏకైక డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ గా నిలబెట్టాయి. Buy From Here

Also Read: భారీ డిస్కౌంట్ తో 43 ఇంచ్ టీవీ ధరకే 55 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!

ZEBRONICS Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ సౌండ్ బార్ అవ్వడానికి డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ అయినా 2.1 ఛానల్ సపోర్ట్ తో మాత్రమే వస్తుంది. ఇందులో రెండు 40W స్పీకర్లు కలిగిన బార్ మరియు 120W పవర్ ఫుల్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ టోటల్ 200W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది.

ZEBRONICS Dolby Atmos Soundbar

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ గ్లాసీ ఫినిష్ తో ప్రీమియం లుక్స్ తో ఉంటుంది. HDMI (eARC), 3.5mm AUX, ఆప్టికల్, USB మరియు బ్లూటూత్ v5.3 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లు ఈ సౌండ్ బార్ లో ఉన్నాయి. ఈ సౌండ్ బార్ ను ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ నుంచి 6 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo