itel A90: అతి చవక ధరలో స్టన్నింగ్ ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్.!
భారత మార్కెట్లో ఐటెల్ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది
itel A90 ఫోన్ ను అతి చవక ధరలో స్టన్నింగ్ డిజైన్ మరియు ఫీచర్స్ తో ఐటెల్ లాంచ్ చేసింది
ఫీచర్స్ మాత్రమే కాదు ఈ ఫోన్ పై 2 సంవత్సరాల వారంటీ కూడా అందిస్తోంది
itel A90: భారత మార్కెట్లో ఐటెల్ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను అతి చవక ధరలో స్టన్నింగ్ డిజైన్ మరియు ఫీచర్స్ తో ఐటెల్ లాంచ్ చేసింది. కేవలం డిజైన్ ఫీచర్స్ మాత్రమే కాదు ఈ ఫోన్ పై 2 సంవత్సరాల వారంటీ కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 36 నెలల ల్యాగ్ ఫ్రీ ఆపరేషన్ అందిస్తుందని ఈ ఫోన్ గురించి ఐటెల్ గొప్పగా చెబుతోంది.
Surveyitel A90: ప్రైస్
ఐటెల్ ఎ90 స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బేసిక్ 4GB + 64GB వేరియంట్ ను రూ. 6,499 ధరతో మరియు 4GB + 128GB వేరియంట్ ను రూ. 6,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ స్టార్ లిట్ బ్లాక్, అరోరా బ్లూ, కాస్మిక్ గ్రీన్ మరియు స్పేస్ టైటానియం నాలుగు రంగుల్లో లభిస్తుంది.
ఆఫర్స్
ఈ ఫోన్ పై ఆకట్టుకునే ఆఫర్స్ కూడా ఐటెల్ అందించింది. ఈ ఫోన్ పై 100 రోజుల స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ అందించింది. అంటే, ఈ ఫోన్ కొనుగోలు చేసిన 100 రోజుల లోపు స్క్రీన్ లో ఏదైనా డిఫెక్ట్ కనిపిస్తే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తుందని ఐటెల్ చెబుతోంది. ఈ ఫోన్ తో మూడు నెలల Jiosaavn Pro సబ్ స్క్రిప్షన్ కూడా ఉచితంగా అందిస్తుంది.
Also Read: Noise Buds X Ultra: హైబ్రిడ్ ANC మరియు LHDC సపోర్ట్ తో కొత్త బడ్స్ లాంచ్ చేస్తున్న నోయిస్.!
itel A90: ఫీచర్స్
ఈ ఐటెల్ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ 90Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HD+ రిజల్యూషన్ మరియు 480 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Unisoc T7100 ఆక్టాకోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఇందులో 4GB ఫిజికల్ ర్యామ్, 8GB అదనపు ర్యామ్ సపోర్ట్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి.

ఐటెల్ ఎ90 స్మార్ట్ ఫోన్ 13MP రియర్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్
HDR మోడ్, 1080p వీడియో రికార్డింగ్ మరియు మరిన్ని కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ itel OS 14 సాఫ్ట్ వేర్ పై ఆండ్రాయిడ్ 14 (Go edition) పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 5000mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది మరియు ఈ ఫోన్ 15W ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. కానీ ఈ ఫోన్ తో 10W ఛార్జర్ ను మాత్రమే కంపెనీ ఆఫర్ చేస్తోంది.
ఈ ఫోన్ IP54 రేటింగ్ తో వస్తుంది మరియు తుంపర్ల నుంచి రక్షణ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పై 24 నెలల వారంటీ అందిస్తుంది మరియు 36 నెలల ల్యాగ్ ఫ్రీ ఆపరేషన్ అందిస్తుందని ఐటెల్ చెబుతోంది.