boAt Chrome Horizon స్మార్ట్ వాచ్ ను వీడియో వాచ్ ఫేసెస్ ఫీచర్ తో లాంచ్ చేసింది.!

HIGHLIGHTS

boAt Chrome Horizon స్మార్ట్ వాచ్ ను ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది

వీడియో వాచ్ ఫేసెస్ మరియు యానిమేటెడ్ వాచ్ ఫేసెస్ ఫీచర్ తో లాంచ్ చేసింది

ఈ స్మార్ట్ వాచ్ సిలికాన్, లెథర్ మరియు స్టీల్ స్ట్రాప్స్ లో లభిస్తుంది.

boAt Chrome Horizon స్మార్ట్ వాచ్ ను వీడియో వాచ్ ఫేసెస్ ఫీచర్ తో లాంచ్ చేసింది.!

boAt Chrome Horizon స్మార్ట్ వాచ్ ను ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ను రెగ్యులర్ స్మార్ట్ వాచ్ ల మాదిరిగా కాకుండా వీడియో వాచ్ ఫేసెస్ మరియు యానిమేటెడ్ వాచ్ ఫేసెస్ ఫీచర్ తో బోట్ లాంచ్ చేసింది. బోట్ సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ వాచ్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

boAt Chrome Horizon : ప్రైస్

బోట్ ఈ స్మార్ట్ వాచ్ ను రూ. 2,799 రూపాయల ధరతో మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ మరియు బోట్ అధికారిక సైట్ నుంచి లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ సిలికాన్, లెథర్ మరియు స్టీల్ స్ట్రాప్స్ లో లభిస్తుంది.

boAt Chrome Horizon : ఫీచర్స్

బోట్ క్రోమ్ హారిజన్ స్మార్ట్ వాచ్ స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఈ బోట్ స్మార్ట్ వాచ్ 1.51 ఇంచ్ ఇమ్మర్సివ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ బోట్ స్మార్ట్ వాచ్ స్క్రీన్ 2.5D కర్వ్ గ్లాస్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 466×466 రిజల్యూషన్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు వేక్ జెశ్చర్ కంట్రోల్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ ఫంక్షనల్ క్రౌన్ ను కూడా కలిగి ఉంటుంది.

boAt Chrome Horizon

ఈ కొత్త స్మార్ట్ వాచ్ ను వారం మొత్తం బ్యాటరీ లైఫ్ అందించే బ్యాటరీ మరియు ASAP ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. ఈ వాచ్ IP68 రేటింగ్ తో డస్ట్, స్వెట్ మరియు స్ప్లాష్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: Amazon Summer Sale టాప్ స్మార్ట్ టీవీ డీల్స్ రివీల్ చేసిన అమెజాన్.!

ఈ బోట్ స్మార్ట్ వాచ్ Crest App సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు గొప్ప హెల్త్ డిటైల్స్ అందిస్తుంది. ఈ వాచ్ ఆటో యాక్టివిటీ డిటెక్షన్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ వాచ్ డైలీ యాక్టివిటీ ట్రాకింగ్, స్మార్ట్ రిమైండర్స్, నోటిఫికేషన్, క్విక్ రిప్లై మరియు మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ వాచ్ 100 కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అదనంగా, ఈ బాట్ స్మార్ట్ వాచ్ వీడియో వాచ్ ఫేసెస్ మరియు యానిమేటెడ్ వాచ్ ఫేసెస్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo