10th Class Results రేపు విడుదల అవుతాయి.. online ఎలా చెక్ చేయాలంటే.!
ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షా ఫలితాలు రేపు రిలీజ్ అవుతాయని ప్రభుత్వం తేదీ విడుదల చేసింది
ఆన్లైన్ లో మార్క్ లను ఎక్కించడం వంటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినట్లు వెల్లడి
ఆన్లైన్ లో ఈజీగా ఫలితాలు చెక్ చేసుకునే అవకాశం అందించిన ప్రభుత్వం
10th Class Results: ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షా ఫలితాలు రేపు విడుదల రిలీజ్ అవుతాయని ప్రభుత్వం తేదీ విడుదల చేసింది. ఇప్పటికే, ఆన్లైన్ లో మార్క్ లను ఎక్కించడం వంటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినట్లు కూడా చెబుతున్నారు. ఈ ఫలితాలను ఆన్లైన్ లో అందించడం ద్వారా ఆన్లైన్ లో ఈజీగా ఫలితాలు చెక్ చేసుకునే అవకాశం అందించింది.
Survey10th Class Results
2025 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 23వ తేదీ రిలీజ్ అవుతాయని, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్, లీప్ యాప్ మరియు వాట్సప్ లో మన మిత్ర ద్వారా విధ్యార్దులు చెక్ చేసుకోవచ్చని కూడా తెలిపారు. నిన్న సోమవారం విజయవాడ లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు.
10th Class Results ఎలా చెక్ చేయాలి?
2025 10వ తరగతి పరీక్షా ఫలితాలు రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ అవుతాయి. ఇదే రోజు పబ్లిక్ పరీక్షల ఫలితాలతో పాటు పదవ తరగతి ఓపెన్ స్కూల్ మరియు ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ ఫలితాలు కూడా విడుదల చేయనున్నారు. ఈ ఫలితాల కోసం https://www.bse.ap.gov.in/ మరియు https://apopenschool.ap.gov.in రెండు అధికారిక సైట్స్ ను చూడవచ్చు. అంతేకాదు, ప్రభుత్వ అధికారిక సైట్ లతో పాటు వాట్సప్ మన మిత్ర మరియు LEAP మొబైల్ యాప్స్ లో కూడా అందుబాటులో ఉంటాయి.
వాట్సాప్ లో రిజల్ట్ ఎలా చెక్ చేయాలి?
మీ ఫోన్ లో ఉన్న వాట్సాప్ ద్వారా రిజల్ట్ ను చాలా సులభంగా చెక్ చేయవచ్చు. వాట్సాప్ లో రిజల్ట్స్ చెక్ చేయడానికి మన మిత్ర (వాట్సాప్ గవర్నెన్స్) నెంబర్ 9552300009 కి ‘Hi’ అని మెసేజ్ పంపించాలి. ఈ మెసేజ్ పంపిన తర్వాత చాట్ బాట్ మీకు ప్రభుత్వ సర్వీస్ కోసం మెయిన్ లీక్ ను అందిస్తుంది. ఇక్కడ అందించిన సర్వీస్ మెసేజ్ లో క్రింద “సేవను ఎంచుకోండి” అని రాసి ఉన్నా వద్ద టచ్ చేయండి.

ఇక్కడ కొత్త సర్వీస్ పేజి ఓపెన్ అవుతుంది. ఇందులో చాలా సర్వీస్ లకు ఆప్షన్ లు అందిస్తుంది. వాటిలో పైన కనిపించే “విద్య సేవలు” ను ఎంచుకోండి. ఇక్కడ SSC ఫలితాలు మరియు ఓపెన్ స్కూల్ ఫలితాల కోసం కూడా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో SSC ఫలితాలు ఎంచుకొని క్రింద నిర్ధారించండి పై నొక్కండి. వెంటనే ఇక్కడ మీ ‘Hall Ticket’ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు రిజల్ట్ కోరుకునే హల టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే రిజల్ట్ ను PDF ఫైల్ లో అందిస్తుంది.
Also Read: Sony Smart Tv పై భారీ ఆఫర్లు అనౌన్స్ చేసిన అమెజాన్.!
ప్రతి ఒక్కరి వద్ద మొబైల్ మరియు వాట్సాప్ అకౌంట్ ఉంటుంది కాబట్టి ఈ పద్ధతి చాలా సులభమైనదిగా భావించి ఈ పద్దతిని సవివరంగా అందించాము.