Sony Smart Tv పై భారీ ఆఫర్లు అనౌన్స్ చేసిన అమెజాన్.!
Sony Smart Tv పై అమెజాన్ ఇండియా ఈరోజు భారీ ఆఫర్లు అనౌన్స్ చేసింది
ఇటీవల ప్రకటించిన BRAVIA 2 సిరీస్ స్మార్ట్ టీవీ పై ఈ బిగ్ డీల్స్ అందించింది
సోనీ స్మార్ట్ టీవీని మంచి ఆఫర్ ధరకే సొంతం చేసుకునే అవకాశం
Sony Smart Tv పై అమెజాన్ ఇండియా ఈరోజు భారీ ఆఫర్లు అనౌన్స్ చేసింది. సోనీ ఇండియాలో ఇటీవల ప్రకటించిన BRAVIA 2 సిరీస్ స్మార్ట్ టీవీ పై ఈ బిగ్ డీల్స్ అందించింది. అమెజాన్ అందించిన ఆఫర్స్ తో లేటెస్ట్ సోనీ స్మార్ట్ టీవీని మంచి ఆఫర్ ధరకే సొంతం చేసుకునే అవకాశం ఈరోజు అమెజాన్ అందించింది. అమెజాన్ అందించిన ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ పై ఒక లుక్కేద్దామా.
SurveySony Smart Tv : ఆఫర్
సోనీ ఇండియాలో ఇటీవల విడుదల చేసిన 55 ఇంచ్ BRAVIA 2 4K Ultra HD స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ K-55S25B పై ఏఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఇండియాలో రూ. 63,990 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ ఈ స్మార్ట్ టీవీని మంచి డిస్కౌంట్ అందించింది రూ. 58,490 ధరకే ఆఫర్ చేస్తోంది.
కేవలం పైన తెలిపిన డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ స్మార్ట్ టీవీ పై రూ. 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీని HDFC Bank Debit EMI ఆఫర్ తో తీసుకునే వారికి రూ. 3,250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సోనీ స్మార్ట్ టీవీ రూ. 53,240 ధరకే అందుకోవచ్చు. అంటే, ఈ స్మార్ట్ టీవీ అన్ని ఆఫర్స్ తో రూ. 10,000 తక్కువ ధరకే లభిస్తుంది. Buy From Here
Also Read: లేటెస్ట్ Dolby Audio సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డీల్ అందుకోండి.!
Sony Smart Tv : ఫీచర్స్
ఈ సోనీ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ LED స్క్రీన్ తో వస్తుంది మరియు ఈ స్క్రీన్ 4K UHD రిజల్యూషన్ తో పాటు 60Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ 4K Processor X1 తో పని చేస్తుంది. ఈ టీవీ HDR10 మరియు HLG సపోర్ట్ గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ టీవీ Live Color మరియు 4K X-Reality PRO సపోర్ట్ తో కూడా వస్తుంది అద్భుతమైన రియల్ లైఫ్ కలర్స్ అందిస్తుంది.

ఈ సోనీ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ Dolby Audio సపోర్ట్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ రెండు ఓపెన్ బఫెల్ స్పీకర్లు కలిగి టోటల్ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ ALLM/eARC, ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్, ఇన్ బిల్ట్ Wi-Fi, బ్లూటూత్ మరియు గూగుల్ అసిస్టెంట్ వంటి అన్ని కనెక్టివిటీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ని ఈరోజు అమెజాన్ నుంచి మంచి ఆఫర్ ధరకే అందుకోవచ్చు.