Acer Smartphone: భారత మార్కెట్లో స్మార్ట్ ఫోన్స్ విడుదల చేయబోతున్న ఏసర్.!
ఏసర్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది
ఈ స్మార్ట్ ఫోన్ కోసం టీజింగ్ ను కూడా మొదలు పెట్టింది
ఈ స్మార్ట్ ఫోన్ ను ‘The next Horizon’ క్యాప్షన్ తో టీజింగ్ చేస్తోంది
Acer Smartphone: తైవాన్ బేస్డ్ ప్రముఖ మల్టీ నేషనల్ ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్ వేర్ కంపెనీ ఏసర్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం టీజింగ్ ను కూడా మొదలు పెట్టింది. ఏసర్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కొత్తగా టీజింగ్ చేస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ ను ‘The next Horizon’ క్యాప్షన్ తో టీజింగ్ చేస్తోంది.
SurveyAcer Smartphone : లాంచ్
ఏసర్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను మార్చి 25 వ తేదీ ఇండియాలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ను సేల్ పార్ట్నర్ గా ఎంచుకున్నట్లు వుంది. ఎందుకంటే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి అందించింది టీజింగ్ చేస్తోంది.
Acer Smartphone : విశేషాలు
అప్ కమింగ్ ఫోన్ లాంచ్ కోసం ఏసర్ అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ యొక్క ఎటువంటి వివరాలు బయటపెట్టలేదు. అయితే, ఈ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది కాబట్టి అతి త్వరలోనే ఈ ఫోన్ కీలకమైన వివరాలు మరియు ఫోన్ డిజైన్ తెలియ చేసే యిమేజ్ లను కూడా అందించవచ్చని ఊహిస్తున్నారు.

అయితే, ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో గొప్ప కెమెరా మరియు పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు గొప్ప డిజైన్ తో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అందించవచ్చని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే, ఈ ఫోన్ ను స్పేస్ లో ఉన్న ఆస్ట్రోనాట్ మరియు భూమిని సింబాలిజం గా చూపించింది. అంటే, ఈ ఫోన్ లో భారీ జూమ్ ఫీచర్ కలిగిన కెమెరా ఉండవచ్చనే అంచనా వేస్తున్నారు.
Also Read: యాపిల్ కొత్త M4 చిప్ తో MacBook Air ను లాంచ్ చేసింది : ధర ఎంతంటే.!
ఇది మాత్రమే కాదు ఇప్పటికే మార్కెట్ లో చాలా స్మార్ట్ ఫోన్ లు గొప్ప ఫీచర్స్ తో గొప్ప కాంపిటీషన్ అందిస్తున్నాయి. ఏసర్ తిరిగి మార్కెట్ లోకి వస్తోంది కాబట్టి ఆ మాత్రం ఫీచర్స్ మరియు స్పెక్స్ ఉండాలి అని నిపుణులు చెబుతున్నారు. మరి ఏసర్ లాంచ్ చేయబోయే అప్ కమింగ్ ఫోన్లు ఎలా ఉంటాయో ముందు ముందు తెలుస్తుంది కాబోలు.