BSNL super Plan: బిఎస్ఎన్ఎల్ యూజర్లకు చాలా తక్కువ ఖర్చులో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ అయితే కేవలం రూ. 100 కంటే తక్కువ ధరలోనే కాలింగ్, డేటా మరియు SMS వంటి అన్ని బెనిఫిట్స్ ఆఫర్ చేస్తాయి. ఈరోజు అటువంటి బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఒకదాని గురించి మాట్లాడుకున్నాము. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ చాలా తక్కువ ఖర్చులో ఆల్ రౌండ్ బెనిఫిట్స్ అందిస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
BSNL super Plan: ఏమిటా ప్లాన్?
బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం అతి చవక ధరలో అందించిన వన్ ఇయర్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 1,198 ఇందుకు బెస్ట్ ఉదాహరణ. బిఎస్ఎన్ఎల్ అందించిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 3365 రోజులు ఆల్ రౌండ్ బెనిఫిట్స్ అందిస్తుంది మరియు ఈ ప్లాన్ మొత్తం అమౌంట్ ను నెల వారీగా విభజిస్తే, ఇది రూ. 100 రూపాయల కంటే తక్కువ ఖర్చు మాత్రమే అవుతుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు సంవత్సరం మొత్తం ఆల్ రౌండ్ ప్రయోజనాలు అందుతాయి.
ఇక ఈ బిఎస్ఎన్ఎల్ రూ. 1,198 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్ వివరాల్లోకి వెళితే, ఈ ప్లాన్ 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. అయితే, ఈ ప్లాన్ అందించే బెనిఫిట్స్ నెల వారీగా అందించబడతాయి. అంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు నెలకు 300 మినిట్స్ కాలింగ్, 3GB డేటా మరియు 30 SMS వినియోగ ప్రయోజనం చొప్పున 12 నెలల వరకు ప్రతి నెల అందించబడతాయి.
అయితే, ఈ ఫ్రీ బైస్ ముగిసిన తర్వాత రెగ్యులర్ ఛార్జ్ లు వర్తిస్తాయి. అంటే, లోకల్ కాల్ కి రూ. 1, STD కాల్ కోసం రూ. 1.30 పైసలు, లోకల్ SMS కోసం 80 పైసలు మరియు నేషనల్ SMS కోసం రూ. 1.20 పైసలు ఛార్జ్ వర్తిస్తాయి. ఇది కాకుండా, 1MB డేటా కోసం 25 పైసలు చెల్లించవలసి వస్తుంది.