Smart Tv: భారీ డిస్కౌంట్ తో కేవలం 6 వేల బడ్జెట్ లోనే 32 ఇంచ్ స్మార్ట్ టీవీ అందుకోండి.!
ఈరోజు ఒక బెస్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్ మీకోసం అందుబాటులో వుంది
బిగ్ స్మార్ట్ టీవీని సైతం కేవలం 6 వేల రూపాయల అతి తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు
ఈ స్మార్ట్ టీవీ Dolby Audio సపోర్ట్ తో వస్తుంది
Smart Tv: చాలా చవక ధరలో స్మార్ట్ టీవీ కోసం వెతుకుతున్నారా? అయితే, మీ టీవీ సెర్చ్ లో మేము కూడా పాలుపంచుకోనున్నాము. ఈరోజు ఒక బెస్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్ మీకోసం అందుబాటులో వుంది. ఈ స్మార్ట్ టీవీ డీల్ ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తుంది. ఈ డీల్ తో 32 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీని సైతం కేవలం 6 వేల రూపాయల అతి తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.
SurveySmart Tv: ఏమిటా ఆఫర్?
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Coocaa యొక్క 32 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఈ ఆఫర్ తో లభిస్తోంది. కూకా బ్రాండ్ నుంచి వచ్చిన 32 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (32S3U Plus) ఈరోజు ఈ ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ టీవీ లాంచ్ సమయంలో రూ. 10,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 3,500 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.
ఈ స్మార్ట్ టీవీని ఇంకా తక్కువ ధరకు అందుకునేలా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందించింది. అవేమిటంటే, ఈ కూకా స్మార్ట్ టీవీని HDFC, BOBCARD మరియు Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లతో కొనే వారికి రూ. 749 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీని కేవలం రూ. 6,750 రూపాయల అతి తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ Flipkart నుంచి లభిస్తుంది.
Also Read: Vivo T4x 5G: సెగ్మెంట్ బిగ్ బ్యాటరీ మరియు సూపర్ డిజైన్ తో వస్తుంది.!
Coocaa (32) Smart Tv: ఆఫర్
ఈ కూకా స్మార్ట్ టీవీ HD Ready (1366 x 768) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన LED ప్యానల్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఫ్రేమ్ లెస్ డిజైన్ మరియు స్లిమ్ మెటల్ బాడితో తో వస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ మరియు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

ఈ కూకా స్మార్ట్ టీవీ Dolby Audio సపోర్ట్ తో వస్తుంది మరియు 30 W సౌండ్ అందించే స్పీకర్లు కలిగి గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ Coolita 3.0 OS పై నడుస్తుంది. ఈ టీవీలో Netflix మరియు గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ లేకపోవడం లోతుగా చెప్పవచ్చు. ఈ టీవీ HDMI, USB, బ్లూటూత్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi సపోర్ట్ కలిగి ఉంటుంది.