Nothing Phone (3a) Series స్టన్నింగ్ లుక్ మరియు పవర్ ఫుల్ కెమెరాతో వస్తోంది.!

HIGHLIGHTS

ఎట్టకేలకు Nothing Phone (3a) Series ఫోన్ ఫుల్ లుక్ ను విడుదల చేసింది

ఇప్పటి వరకు కేవలం కొన్ని ఫీచర్స్ ను మాత్రమే బయట పెట్టిన నథింగ్

ఈ రోజు నథింగ్ అప్ కమింగ్ ఎలా ఉంటుందో తెలిపే టీజర్ ఇమేజ్ ను రిలీజ్ చేసింది

Nothing Phone (3a) Series స్టన్నింగ్ లుక్ మరియు పవర్ ఫుల్ కెమెరాతో వస్తోంది.!

Nothing Phone (3a) Series లాంచ్ కోసం చాలా కాలంగా టీజింగ్ చేస్తున్న కంపెనీ ఎట్టకేలకు ఈ ఫోన్ ఫుల్ లుక్ ను విడుదల చేసింది. ఇప్పటి వరకు కేవలం కొన్ని ఫీచర్స్ ను మాత్రమే బయట పెట్టిన నథింగ్, ఈ ఫోన్ ఇమేజ్ ను మాత్రం బయపెట్ట లేదు. అయితే, ఈ రోజు నథింగ్ అప్ కమింగ్ ఎలా ఉంటుందో తెలిపే టీజర్ ఇమేజ్ ను రిలీజ్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Nothing Phone (3a) Series

నథింగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ (3a) సిరీస్ ను మార్చి 4వ తేదీ సాయంత్రం 3:30 గంటలకు ఇండియాలో విడుదల చేస్తుంది. ఈ ఫోన్ కోసం టైం లైన్ సెట్ చేసిన కంపెనీ డైలీ సరికొత్త టీజర్ తో ఈ ఫోన్ పై గొప్ప హైప్ తెచ్చింది. ఈరోజు ఈ ఫోన్ పై పరదా తొలగించి ఫోన్ ఎలా ఉంటుందో బయట పెట్టింది.

ఈ ఫోన్ ఎలా ఉంటుంది?

ఈ ఫోన్ సరికొత్త స్టన్నింగ్ లుక్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ముందుగా వచ్చిన నథింగ్ ఫోన్స్ అప్గ్రేడ్ గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే, 3a సిరీస్ ఫోన్ లలో వెనుక సరికొత్త కెమెరా సెటప్ మరియు లైట్ సెటప్ కనిపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇప్పటి వరకు నథింగ్ డ్యూయల్ రియర్ కలిగిన ఫోన్ లను మాత్రమే అందించింది. ఈ సెటప్ కొత్త అప్గ్రేడ్ అవుతుంది.

Nothing Phone (3a) Series

అంతేకాదు, ఈ కెమెరా సెటప్ లో పెరిస్కోప్ కెమెరాని జత చేసింది. ఈ ఫోన్ పెరిస్కోప్ కలిగిన మొదటి నథింగ్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. ఈ ఫోన్ లో వెనుక రౌండ్ కెమెరా బంప్ ను మరియు ఆకట్టుకునే హాఫ్ రౌండ్ లైట్ సెటప్ తో అందించింది. ఈ పూర్తి సెటప్ ఫోన్ ను ఆకర్షనీయంగా మార్చింది.

Also Read: 6 వేలకే 200W 5.1 ఛానల్ బ్రాండెడ్ Soundbar అందుకునే గొప్ప ఛాన్స్.!

ఇక ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ యొక్క మరిన్ని ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ Snapdragon లేటెస్ట్ చిప్ సెట్ తో లాంచ్ అవుతాయి. ఈ ఫోన్ బ్లాక్ మరియు గ్రే రెండు కలర్ లలో వచ్చే అవకాశం ఉండవచ్చు. ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్లులు కూడా కంపెనీ త్వరలో అందించవచ్చు. ప్రస్తుతానికైతే ఫోన్ లుక్స్ అదరగొడుతోంది.అంరై మరి ఈ ఫోన్ పూర్తి ఫీచర్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo