4-in-1 వైర్లెస్ చార్జర్ కమ్ పవర్ బ్యాంక్ ను లాంచ్ చేసిన Ambrane బ్రాండ్.!

HIGHLIGHTS

Ambrane కొత్త ప్రోడక్ట్ ను లాంచ్ చేసింది

4-in-1 వైర్లెస్ చార్జర్ కమ్ పవర్ బ్యాంక్ ను లాంచ్ చేసింది

ఈ పవర్ బ్యాంక్ ను 1000mAh సామర్ధ్యంతో తీసుకు వచ్చింది

4-in-1 వైర్లెస్ చార్జర్ కమ్ పవర్ బ్యాంక్ ను లాంచ్ చేసిన Ambrane బ్రాండ్.!

ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్స్ మరియు వేరబుల్ మాన్యుఫ్యాక్చరర్ Ambrane కొత్త ప్రోడక్ట్ ను లాంచ్ చేసింది. ప్రస్తుత నవీన స్మార్ట్ పరికరాల కోసం తగిన ఫీచర్స్ కలిగిన కొత్త 4-in-1 వైర్లెస్ చార్జర్ కమ్ పవర్ బ్యాంక్ ను లాంచ్ చేసింది. ఈ పవర్ బ్యాంక్ ను 1000mAh సామర్ధ్యంతో తీసుకు వచ్చింది మరియు ‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రొడక్ట్స్ అవుతుంది. అంబ్రేన్ తీసుకు వచ్చిన ఈ కొత్త 4-in-1 వైర్లెస్ చార్జర్ కమ్ పవర్ బ్యాంక్ ధర మరియు ఫీచర్ల పైన ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Ambrane 4-in-1 పవర్ బ్యాంక్ ధర

ఈ అంబ్రేన్ 4-in-1 వైర్లెస్ చార్జర్ కమ్ పవర్ బ్యాంక్ ను కేవలం రూ. 1,999 రూపాయల ధరలో లాంచ్ చేసింది. ఈ అంబ్రేన్ 4-in-1 వైర్లెస్ చార్జర్ కమ్ పవర్ బ్యాంక్ ఈరోజు నుండి Amazon, Flipkart, మరియు Ambrane యొక్క అధికారిక వెబ్సైట్ నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది.

Also Read: itel P55 series Launch: కొత్త ఫోన్లను లాంఛ్ చేస్తున్న ఐటెల్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!

Ambrane 4-in-1 పవర్ బ్యాంక్ ప్రత్యేకతలు

అంబ్రేన్ 4-in-1 వైర్లెస్ చార్జర్ కమ్ పవర్ బ్యాంక్ ను AeroSync Quad, అంటే 4-in-1 ఛార్జింగ్ మ్యాస్ట్రో గా తీసుకు వచ్చింది. ఈ పవర్ బ్యాంక్ 5W వైర్లెస్ బేస్ తో earbuds మరియు smartphone లను ఛార్జ్ చెయ్యగలదు. అలాగే, 15W పోర్ట్రబుల్ వైర్లెస్ పవర్ బ్యాంక్ గా మరియు Type-C పోర్ట్ తో 22.5W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ ను కూడా అందిస్తుంది. ఇది USB పోర్ట్ తో కూడా 22.5W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ ను అందిస్తుంది.

ఈ పవర్ బ్యాంక్ Quick Charge 3.0 తో చాలా వేగంగా ఛార్జ్ చేస్తుందని అంబ్రేన్ తెలిపింది. అంతేకాదు, Type C 20W fast input ట్ చాలా వేగంగా ఈ పవర్ బ్యాంక్ ఛార్జ్ కూడా అవ్వగలదని అంబ్రేన్ పేర్కొంది.ఈ పవర్ బ్యాంక్ 180-day వారెంటీ మరియు BIS certified తో వస్తుంది. అంబ్రేన్ 4-in-1 వైర్లెస్ చార్జర్ కమ్ పవర్ బ్యాంక్ USB-A మరియు Type-C పోర్ట్ లతో ఉండే అన్ని పరికరాలకు సపోర్ట్ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo