Jio Republic Day Offer 2024: అధిక లాభాలతో కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో.!

HIGHLIGHTS

రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్ లో భాగంగా Jio Republic Day Offer 2024 లాంచ్

ఆల్ రౌండ్ లాభాలను అందించేలా ఈ ఆఫర్ ను తీసుకు వచ్చినట్లు జియో తెలిపింది

ఇది కేవలం లిమిటెడ్ ఆఫర్ మాత్రమే కాబట్టి గడువు ముగిసే లోపు రీఛార్జ్ చేసుకోవాలి

Jio Republic Day Offer 2024: అధిక లాభాలతో కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో.!

2024 సంవత్సర రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్ లో భాగంగా రిలయన్స్ జియో కొత్త Jio Republic Day Offer 2024 ని లాంచ్ చేసింది. జియో యూజర్లకు ఆల్ రౌండ్ లాభాలను అందించేలా ఈ ప్లాన్ ను తీసుకు వచ్చినట్లు జియో తెలిపింది. ఈ జియో రిపబ్లిక్ డే ఆఫర్ 2024 అనేది కేవలం రూ. 2999 రూపాయల రీఛార్జ్ ను చేసే యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇది కేవలం లిమిటెడ్ ఆఫర్ మాత్రమే కాబట్టి గడువు ముగిసే లోపుగా ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Jio Republic Day Offer 2024

రిలయన్స్ కొత్తగా తీసుకు వచ్చిన ఈ ఆఫర్ ను అందుకోవడానికి రూ. 2999 ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే కొత్త మరియు పాత Jio యూజర్లు మాత్రమే అర్హులు. ఈ ఆఫర్ తో షాపింగ్ మొదలు కొని ట్రావెలింగ్ మరియు ఫుడ్ వరకూ దాదాపుగా రూ. 3,000 రూపాయలకు పైగా లాభాలను అందుకునే అవకాశం ఉంటుంది.

ఏమిటి ఈ జియో రిపబ్లిక్ డే ఆఫర్ 2024?

Jio Republic Day Offer 2024

జియో రిపబ్లిక్ డే ఆఫర్ 2024 అనేది జియో తీసుకు వచ్చిన కొత్త ఆఫర్. ఈ ఆఫర్ ను అందుకోవడానికి రూ. 2,999 రూపాయల వన్ ఇయర్ జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేయవలసి ఉంటుంది.

Also Read : Gold Price Drop: మళ్ళీ దిగజారిన గోల్డ్ మార్కెట్.. ఈరోజు ధర ఎంతంటే.!

జియో రిపబ్లిక్ డే ఆఫర్ తో ఎటువంటి లాభాలను పొందవచ్చు?

ఈ జియో కొత్త ఆఫర్ తో AJIO – లో రూ. 2,499 పైన చేసే షాపింగ్ పైన Rs.500 తగ్గింపు అందుకోవచ్చు. అలాగే, Tira ప్రోడక్ట్స్ Rs.999 పైగా చేసే షాపింగ్ పైన 30% వరకు (max Rs.1,000) తగ్గింపు పొందవచ్చు. Reliance Digital లో చేసే షాపింగ్ పైన కూడా 10% తగ్గింపు అందుకోవచ్చు. అయితే, ఈ డిస్కౌంట్ కేవలం Rs.5000 పైగా మరియు రూ. 10,000 లోపల చేసే కొనుగోళ్ల పైన మాత్రమే వర్తిస్తుంది.

ఈ ఆఫర్ తో Ixigo పైన బుక్ చేసే ఫ్లయిట్ టికెట్స్ పైన ఒక్కొకరికి రూ. 500 పైన చొప్పున మొత్తం మూడు టికెట్స్ కి Rs.1500 రూపాయల తగ్గింపు లభిస్తుంది. ఇది మాత్రమే Rs. 299 పైన చేసే Swiggy ఆర్డ్సర్ పైన Rs. 125 తగ్గింపు కూడా లభిస్తుంది (2 కూపన్స్)

రూ. 2,999 ప్లాన్ ప్రయోజనాలు?

జియో రూ. 2,999 అనేది జియో ఆఫర్ చేస్తున్న బడ్జెట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈప్లాన్ తో 365 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2.5GB డేటాని మరియు రోజు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ తో ఎలిజిబుల్ యూజర్లు 5G నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5జి డేటాని ఆనందించవచ్చు. ఇది మాత్రమే కాదు, జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ కూడా అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo