2024 Jio best Offer: రిలయన్స్ జియో కస్టమర్ల కోసం 2024 సంవత్సరం కానుకగా కొత్త ఆఫర్లను అందించింది. అయితే, ఈ ఆఫర్ లను గత నెల చివరిలోనే జియో ప్రకటించింది. జియో యూజర్లు కేవలం రూ.200 కంటే తక్కువ ఖర్చుతోనే 12 OTT లు మరియు డేటాను అందుకునేలా ఈ కొత్త ఆఫర్ ను తీసుకు వచ్చింది. కేవలం బడ్జెట్ రేటు లోనే ఎక్కువ లాభాలను అందించే ఈ కొత్త జియో ప్రీపెయిడ్ ప్లాన్ గురించి మీరు తెలుసుకోండి మరి.
Survey
✅ Thank you for completing the survey!
2024 Jio best Offer
రిలయన్స్ జియో 2023 చివరిలో అందించిన JioTV PREMIUM Plans లో అత్యంత చవకైన ప్లాన్ రూ. 148 ప్లాన్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. ఈ రూ. 148 ప్రీపెయిడ్ ప్లాన్ చాలా తక్కువ ధరలో ఎక్కువ లాభాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అందించే అన్ని లాభాలను మరియు ప్రయోజనాలను ఇక్కడ చూడవచ్చు.
రిలయన్స్ కొత్తగా తీసుకు వచ్చిన ఈ ఎంటర్టైన్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం రూ. 148 రూపాయలకే 12 OTT ప్లాట్ ఫామ్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. ఈ ప్లాన్ అందించే ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో Sony LIV, ZEE5, Chaupal, Docubay, EPIC ON, Hoichoi, Liongate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka మరియు Planet Marathi ఉన్నాయి.
జియో Rs. 148 ఎంటర్టైన్మెంట్ ప్లాన్
కేవలం ఇది మాత్రామే కాదు జియో సినిమా ప్రీమియం 28 రోజుల సబ్ స్క్రిప్షన్ కూపన్ కూడా మీ జియో అకౌంట్ లో జమ చేయబడుతుంది. అంతేకాదు, 28 రోజులకు గాను 10GB హై స్పీడ్ డేటా కూడా ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు లభిస్తుంది.
ఇది జియో ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ కేటగిరిలో అతి తక్కువ ధరలో లభించే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ గా నిలుస్తుంది.