boAt Katana Blade: కొత్త ఫీచర్ తో ఇయర్ బడ్స్ లాంచ్ చేసిన బోట్.!

HIGHLIGHTS

కొత్త ఫీచర్ తో ఇయర్ బడ్స్ లాంచ్ చేసిన బోట్

ఈ బడ్స్ కొత్త ఫీచర్ మరియు LED లైట్స్ తో సరికొత్తగా కనిపిస్తోంది

boAt Katana Blade పేరుతో తీసుకు వచ్చిన బడ్స్

boAt Katana Blade: కొత్త ఫీచర్ తో ఇయర్ బడ్స్ లాంచ్ చేసిన బోట్.!

అందరికీ సుపరిచితమైన ప్రముఖ ఇండియన్ బ్రాండ్ బోట్ కొత్త ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసింది. boAt Katana Blade పేరుతో తీసుకు వచ్చిన ఈ బడ్స్ కొత్త ఫీచర్ మరియు LED లైట్స్ తో సరికొత్తగా కనిపిస్తోంది. ఈ కొత్త బడ్ లను సరికొత్త హంగులతో లాంచ్ చేసింది బోట్. బ్యాటరీ బ్యాకప్ మరియు ఛార్జ్ టెక్ మొదలుకొని పెద్ద స్పీకర్ల వరకూ అన్ని ఫీచర్స్ ను ఈ కొత్త ఇయర్ బడ్స్ కలిగి ఉన్నట్లు బోట్ తెలిపింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

boAt Katana Blade Price

బోట్ కొత్తగా తెచ్చిన ఈ కాటానా బ్లేడ్ ఇయర్ బడ్స్ ను రూ. 2,299 రూపాయల ధరలో లాంచ్ చేసింది. ఈ బడ్స్ ను బోట్ వెబ్సైట్ మరియు అమేజాన్ ఇండియా ను కూడా సేల్ కి అంధుబాటులోకి తీసుకు వచ్చింది. అమేజాన్ నుండి కొనడానికి Click Here

Also Read : Airtel: ఉచిత Netflix సబ్ స్క్రిప్షన్ తో కొత్త ప్లాన్ తెచ్చిన ఎయిర్టెల్.!

బోట్ కాటానా బ్లేడ్ ఇయర్ బడ్స్ ప్రత్యేకతలు

ఇక ఈ బోట్ కాటానా బ్లేడ్ ఇయర్ బడ్స్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ బడ్స్ ను కొత్త కాటానా బ్లేడ్ సౌండ్ ఫీచర్ తో అందించింది బోట్. అంటే, ఇయర్ బడ్స్ కేస్ ను ఓపెన్ మరియు క్లోజ్ చేసే ప్రతీసారి కూడా జాపనీస్ ప్రముఖ బ్లేడ్, కాటానా బ్లేడ్ సౌండ్ చేస్తుంది. దీనికోసం కేస్ లో ప్రత్యేకమైన స్పీకర్ ను కలిగి ఉంటుంది. కంపెనీ దీన్ని Metal Glider with Gliding Blade Sound గా చెబుతోంది.

boAt Katana Blade features
బోట్ కాటానా బ్లేడ్ ఇయర్ బడ్స్

ఈ బడ్స్ Dynamic RGB LEDs తో ముచ్చటగా కనిపించేలా చేసింది బోట్. అలాగే, ఈ బడ్స్ 50 గంటల ప్లేటైమ్ అందించ గల బ్యాటరీ మరియు వేగంగా ఛార్జ్ చెయ్యగల ASAP ఛార్జ్ టెక్ ను కూడా కలిగి వుంది. ఈ బడ్స్ లో పెద్ద 13mm స్పీకర్లు, 50ms బీస్ట్ మోడ్, IPX4 రేటింగ్ మరియు బ్లూటూత్ 5.3 వెర్షన్ తో వస్తుంది.

ఈ ఇయర్ బడ్స్ boAt Signature Sound తో గొప్ప రిచ్ బాస్ మరియు క్రిస్పీ సౌండ్ అందిస్తుందని కూడా బోట్ పేర్కొంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ బడ్స్ చూడటానికి ప్రీమియం లుక్స్ మరియు ఆకర్షణీయమైన బాక్స్ సౌండ్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo