NoiseFit Evolve 4: సింగిల్ టచ్ ర్యాపిడ్ హెల్త్ తో లాంచ్.!

HIGHLIGHTS

నోయిస్ మరొక కొత్త స్మార్ట్ వాచ్ NoiseFit Evolve 4 ను లాంచ్ చేస్తోంది

నవంబర్ 22న ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది

స్పెషల్ లాంచ్ ప్రైస్ తో లాంచ్ చేయనున్నట్లు నోయిస్ ప్రకటించింది

NoiseFit Evolve 4: సింగిల్ టచ్ ర్యాపిడ్ హెల్త్ తో లాంచ్.!

ప్రముఖ ఇండియన్ స్మార్ట్ వాచ్ బ్రాండ్ నోయిస్ మరొక కొత్త స్మార్ట్ వాచ్ NoiseFit Evolve 4 ను లాంచ్ చేస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ రేపు అంటే, నవంబర్ 22న ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ స్మార్ట్ అవ్చ్ యొక్క ధర మరియు ఫీచర్లను ముందుగానే వివరంగా తెలియపరిచింది. కంపెనీ వెబ్సైట్ నుండి అందించిన నోయిస్ ఫిట్ ఎవాల్వ్ ప్రోడక్ట్ పేజ్ ద్వారా ఈ వాచ్ కంప్లీట్ వివరాలను అందించింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ వాచ్ ఎలాంటి వివరాలను కలిగి ఉన్నదో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

NoiseFit Evolve 4 Price

NoiseFit Evolve 4 Price
నోయిస్ ఫిట్ ఎవాల్వ్ 4 స్మార్ట్ వాచ్

నోయిస్ ఫిట్ ఎవాల్వ్ 4 స్మార్ట్ వాచ్ ను రూ. 3,999 రూపాయల స్పెషల్ లాంచ్ ప్రైస్ తో లాంచ్ చేయనున్నట్లు నోయిస్ ప్రకటించింది. అయితే, ఈ స్మార్ట్ వాచ్ MRP 7999 తో చూపిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. రేపు విడుదల కానున్న ఈ స్మార్ట్ వాచ్ పైన రూ. 300 రూపాయల తగ్గింపు ఆఫర్ ను కూడా ప్రకటించింది. అయితే, ఈ డిస్కౌంట్ అఫర్ మొదటి 500 మంది కస్టమర్లకు మాత్రమే అందిస్తుంది.

Also Read : Amazon Mega Electronics Day Sale నుండి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్న ల్యాప్ టాప్స్.!

నోయిస్ ఫిట్ ఎవాల్వ్ ప్రత్యేకతలు

నోయిస్ సరికొత్త స్మార్ట్ వాచ్ నోయిస్ ఫిట్ ఎవాల్వ్ ప్రీమియం బిల్డ్ మరియు మెటాలిక్ స్ట్రాప్ తో వస్తుందని నోయిస్ చెబుతోంది. ఈ స్మార్ట్ వాచ్ ఈజీ స్క్రోలింగ్ ఫంక్షనల్ క్రౌన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 1.46 ఇంచ్ AMOLED డిస్ప్లేని కలిగి వుంది.

NoiseFit Evolve 4 Features
నోయిస్ ఫిట్ ఎవాల్వ్ ప్రత్యేకతలు

ఈ నోయిస్ కొత్త స్మార్ట్ వాచ్ ర్యాపిడ్ హెల్త్ సింగల్ టచ్ తో బటన్ తో అనేక హెల్త్ రిపోర్ట్స్ ను త్వరగా అందిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ SOS టెక్నాలజీని కూడా కలిగి వుంది. దీనిద్వారా, మీరు అత్యవసర సమయంలో ఉన్నప్పుడు కేవలం 8 సెకన్లలోనే మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ కు కాల్ వెళుతుంది.

ఈ స్మార్ట్ వాచ్ నోయిస్ హెల్త్ సూట్ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో 100 కు పైగా వాచ్ ఫేస్ లు, క్యాలిక్యులేటర్ మరియు IP68 వాటర్ రెసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo