Gold Rate Down: దిగొచ్చిన బంగారం ధర..ఏకంగా రూ. 2,500 పతనం| New Price

HIGHLIGHTS

ప్రస్తుతం గోల్డ్ మార్కెట్ ఊహకందకుండా పరుగులు పెడుతోంది

గడిచిన 10 రోజుల్లో భారీ పడిపోయిన Gold Rate

గోల్డ్ మార్కెట్ 8 నెలల కనిష్ట రేటును చూడవలసి వచ్చింది

Gold Rate Down: దిగొచ్చిన బంగారం ధర..ఏకంగా రూ. 2,500 పతనం| New Price

ప్రస్తుతం గోల్డ్ మార్కెట్ ఊహకందకుండా పరుగులు పెడుతోంది. మార్చి నెల తరువాత భారీగా పెరుగుతూ వచ్చిన Gold rate, ఇప్పుడు అంతే స్పీడ్ గా పడిపోవడం చూస్తున్నాము. ఇప్పటికే, గడిచిన 10 రోజుల్లో భారీ పడిపోయిన గోల్డ్ రేట్, ఈరోజు మరింతగా పతనమవ్వడంతో గోల్డ్ మార్కెట్ 8 నెలల కనిష్ట రేటును చూడవలసి వచ్చింది. బంగారం కొనాలని ఎదురు చూస్తున్న వారికి మంచి ఇంపైన వార్తే అవుతుంది. అయితే, ఇటీవల గోల్డ్ షేర్స్ పైన డబ్బు ఇన్వెస్ట్ చేసిన వారికి నిరాశను కలిగిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Gold Rate Down

ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్ లలో కూడా బంగారం ధర భారీ నష్టాలను చూసింది. ఈరోజు రూ. 58,040 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు రూ. 66 రూపాయల్ చొప్పున తులానికి రూ. 660 రూపాయల పతనాన్ని చూసి రూ. 57,380 రూపాయల క్లోజింగ్ ను నమోదు చేసింది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రూ. 600 క్రిందకు దిగి రూ. 52,600 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.

Also Read : BSNL ధమాకా ఆఫర్: రూ. 797 రూపాయలకే 300 రోజులు లాభాలు| New offer

Market Update

గోల్డ్ మార్కెట్

ఇక గడిచిన 10 రోజుల మార్కెట్ ను పరిశీలిస్తే, గడిచిన 10 రోజుల్లో గోల్డ్ రేట్ రోజు రోజుకు నష్టాలనే చూసింది. నిన్నటి వరకూ గోల్డ్ రేట్ రూ. 1,910 రూపాయల నష్టాలను చూసి రూ. 58,040 రూపాయల వద్ద కొసాగుతుండగా, ఈరోజు మార్కెట్ రూ. 660 రూపాయల నష్టాలను చూడటంతో, ప్రస్తుతం రూ. 57,380 రూపాయల కనిష్ట రేటును చూడవలసి వచ్చింది.

హైదరాబాద్ & విజయవాడ గోల్డ్ మార్కెట్

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్ మరియు విజయవాడ లలో గోల్డ్ రేట్ ఎలా ఉందని చూస్తే, ఈరోజు ఈ రెండు నగరాలలో ఒక తులం 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ. 57,380 గా ఉండగా, ఒక తులం 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 52,600 గా వుంది. అంతేకాదు, దేశంలోని చాలా ప్రధాన నగరాల్లో బంగారం ఇదే రేటులో కొనసాగుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo