ఎయిర్టెల్ తన లేటెస్ట్ Airtel Exclusive అఫర్ తో జియోకి షాకిచ్చింది. అతి తక్కువ ధరకే 4G మొబైల్ ను ప్రీపెయిడ్ ప్లాన్ తో అఫర్ చేస్తున్న జియోకి పోటీగా ఈ అఫర్ ను రంగంలోకి దించినట్లు కనిపిస్తోంది. Flipkart Big Saving Days సేల్ నుండి ఈ ఎక్స్ క్లూజివ్ అఫర్ ను ప్రకటించింది. ఈ అఫర్ ద్వారా Poco C51 స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ మరియు ఎయిర్టెల్ ఉచిత డేటా అఫర్ తో పాటుగా మరిన్ని ప్రయోజనాలతో అందుకోవచ్చు. ఎయిర్టెల్ అందించిన ఈ సరికొత్త ఎక్స్ క్లూజివ్ అఫర్ వివరాలు పూర్తిగా తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటి ఈ Airtel Exclusive అఫర్?
ఎయిర్టెల్ ఎక్స్ క్లూజివ్ అఫర్ ద్వారా పోకో లేటెస్ట్ 4G స్మార్ట్ ఫోన్ Poco C51 పైన రూ. 1,000 రూపాయల భారీ డిస్కౌంట్ ను అఫర్ చేస్తోంది. మార్కెట్ లో రూ. 6,999 ధరతో అమ్ముడవుతున్న ఈ పోకో స్మార్ట్ ఫోన్ ను ఈ ఎయిర్టెల్ అఫర్ ద్వారా రూ. 5,999 అఫర్ ధరకే కొనుగోలు చెయవచ్చు.
ఈ అఫర్ ఇప్పటికే కొనసాగుతున్న ఎయిర్టెల్ కస్టమర్లకు మరియు ఎయిర్టెల్ కి పోర్ట్ అవ్వదలుచుకున్న యూజర్లకు వర్తిస్తుంది.
Airtel Exclusive అఫర్ కండిషన్స్ ఏమిటి?
Airtel Exclusive అఫర్ కోసం కొన్ని కండీషన్స్ ను ఎయిర్టెల్ జత చేసింది. ఎయిర్టెల్ జత చేసిన ఈ కండీషన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ రూ.199 లేదా అంతకంటే పైబడిన రీఛార్జ్ 18 నెలలు చేసేలా సెట్ చెయ్యబడుతుంది. అంటే, రూ. 199 పైన మీకు నచ్చిన ఏ ప్లాన్ అయినా మీరు రీఛార్జ్ చేయవచ్చు.
ఈ డ్యూయల్ SIM ఫోన్ లో మెయిన్ సిమ్ ఎయిర్టెల్ ని ఉయోగించాల్సి ఉంటుంది. అలాగే, రెండవ SIM కార్డ్ ఇతర నెట్ వర్క్ వాడుకోవచ్చు. అంతేకాదు, ఈ ఎయిర్టెల్ ఎక్స్ క్లూజివ్ అఫర్ ద్వారా 50GB అదనపు ఉచిత డేటా కూడా లబిస్తుంది.