అమెజాన్ ఆగష్టు నెల లో అందించనున్న అప్ కమింగ్ సేల్ డేట్ ను అనౌన్స్ చేసింది. అదే Amazon Great Freedom Festival మరియు ఈ సేల్ ఆగష్టు 5 నుండి ఆగష్టు 9 వ తేదీ వరకూ జరుగుతుంది. ఈ అప్ కమింగ్ సేల్ ను SBI భాగస్వామ్యంతో అమెజాన్ ప్రకటించింది. ఈ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి అందించనున్న ఆఫర్స్ మరియు డీల్స్ గురించి అమేజాన్ టీజింగ్ ను కూడా స్టార్ట్ చేసింది. అమెజాన్ తీసుకువస్తున్న ఈ అప్ కమింగ్ సేల్ డీల్స్ మరియు ఆఫర్లు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
Amazon Great Freedom Festival సేల్ నుండి 60 కి పైగా కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయబోతోంది అమెజాన్. అంతేకాదు, రీసెంట్ గా రిలీజ్ అయిన మరియు త్వరలో అవ్వబోతున్న ప్రోడక్ట్స్ పైన బ్యాంక్ డీల్స్ ను జత చేస్తుంది. ఈ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ SBI భాగస్వామ్యంతో నిర్వహిస్తోన్నట్లు పీకరటించింది. అందుకే, ఈ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి SBI క్రెడిట్ కార్డ్స్ మరియు EMI తో వస్తువులను కొనే యూజర్లకు 10% డిస్కౌంట్ లభిస్తుంది.
ఇక ఈ సేల్ యొక్క మరిన్ని ఆఫర్ల వివరాల్లోకి వెళితే, ఈ సేల్ నుండి మొబైల్ ఫోన్లు మరియు యాక్ససరీస్ పైన గరిష్టంగా 40%, ఎలక్ట్రానిక్స్ మరియు యాక్ససరీస్ పైన గరిష్టంగా 75%, ఫ్యాషన్ మరియు బ్యూటీ పైన గరిష్టంగా 50% నుండి 80%, టీవీలు మరియు అప్లయన్సెస్ పైన గరిష్టంగా 60% వరకూ డిస్కౌంట్ లను అందుకోవచ్చని అమేజాన్ సేల్ కోసం అందించిన ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది.
ముఖ్యంగా, అమెజాన్ సొంత ప్రోడక్ట్స్ అయిన Kindle, Eoc Dot స్మార్ట్ స్పీకర్లు మరియు FireTv stick వంటి ప్రొడక్ట్స్ పైన భారీ డిస్కౌంట్ ను అఫర్ చేయబోతున్నట్లు టీజింగ్ ద్వారా చెబుతోంది. డిస్కౌంట్ తో లభించనున్న ప్రోడక్ట్స్ పైన 'Wish List' ను కూడా ఈ సేల్ మైక్రో సైట్ పేజ్ ద్వారా అందించింది.