Noise ఇండియాలో కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అదే, Noise Luna Ring పేరుతొ వస్తున్న Smart Ring. ఈ స్మార్ట్ రింగ్ ని ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించడే కాకుండా ఈ రింగ్ ఫీచర్లు మరియు ముందస్తు బుకింగ్ కోసం Priority Access pass ని ప్రోగ్రాం ను కూడా లాంచ్ చేసింది. నోయిస్ తీసుకువస్తున్న ఈ స్మార్ట్ రింగ్ గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Survey
✅ Thank you for completing the survey!
Noise Luna Ring:
నోయిస్ ప్రకటించిన ఈ Noise Luna Ring స్మార్ట్ రింగ్ ని Rise To Brilliance క్యాప్షన్ తో ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఈ Smart Ring లో స్ట్రాంగ్ బిల్డ్ మరియు హెల్త్ ట్రాకింగ్ కోసం అవసరమైన సెన్సార్లు ఉన్నాయి. నోయిస్ ఈ స్మార్ట్ రింగ్ యొక్క కీ ఫీచర్స్ మరియు మరిన్ని వివరాలను తన వైబ్సైట్ ద్వారా తెలియ పరిచింది.
ఈ Smart Ring 70 కి పైగా మెట్రిక్స్ ను ట్రాక్ చేయగలదని నోయిస్ తెలిపింది. ఈ స్మార్ట్ రింగ్ కఠినమైన బిల్డ్ క్వాలిటీ మరియు లోపల అడ్వాన్స్ సెన్సార్ లను కూడా ఇముడ్చుకుంది. ఈ స్మార్ట్ రింగ్ స్లీప్ ట్రాకింగ్ మరియు యూజర్ యాక్టివిటీ లను నిరంతరం నిర్వహిస్తుంది. ఇది స్మార్ట్ వాచ్ ల మాదిరిగా హార్ట్ రేట్, SpO2 వంటి మరిన్ని ఫీచర్లతో వస్తుంది.
ఈ Noise Luna Ring స్మార్ట్ రింగ్ యొక్క ధర మరియు బుకింగ్ కోసం డేట్స్ ని త్వరలోనే తెలియ చేస్తామని నోయిస్ తెలిపింది. స్మార్ట్ రింగ్ సైజ్ ని ఎలా సెలక్ట్ చేస్తారు? అనే విషయం పైన కూడా నోయిస్ క్లారిటీ ఇచ్చింది.
Noise Luna Ring కోసం ఆర్డర్ ని బుక్ చేసిన వారికి నోయిస్ ఒక సైజింగ్ కిట్ ను పంపిస్తుంది. ఈ సైజింగ్ కిట్ ద్వారా యూజర్లు వారికీ తగిన సైజును సెలెక్ట్ చేసుకోవచ్చు. నోయిస్ యొక్క ఈ స్మార్ట్ రింగ్ Android మరియు iOS రెండింటికి సపోర్ట్ చేస్తుంది.