Gold Rate: ఈరోజు దారుణంగా పడిపోయిన బంగారం ధర.!

Gold Rate: ఈరోజు దారుణంగా పడిపోయిన బంగారం ధర.!
HIGHLIGHTS

ఈరోజు మార్కెట్ లో దారుణంగా పడిపోయిన బంగారం ధర

ఈ వారం ప్రారంభం నుండి బంగారం ధర క్రిందకు పడిపోవడం ప్రారంభించింది

ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ ఎలా ఉన్నదో తెలుసుకోండి

Gold Rate: ఈరోజు మార్కెట్ లో దారుణంగా పడిపోయిన బంగారం ధర. గత కొన్ని రోజులుగా ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడనంత భారీ పెరుగుదలను నమోదు చేస్తున్న గోల్డ్ మార్కెట్ ఈరోజు దారుణంగా పడిపోయింది. గత వారం మొత్తం పెరుగుదలను చూసిన గోల్డ్ మార్కెట్ ఈ వారం ప్రారంభం నుండి క్రిందకు పడిపోవడం ప్రారంభించింది. సోమవారం తులానికి 540 రూపాయలు పడిపోయిన బంగారం ధర, ఈరోజు తులానికి రూ.870 రూపాయలు క్రిందకు పడిపోయింది. ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ ఎలా ఉన్నదో చూద్దాం పదండి. 

Gold Rate:

ఈరోజు ప్రధాన మార్కెట్ లో రూ.55,000 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.800 రూపాయలు క్రిందకు దిగి రూ.54,200 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, రూ.60,000 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ఈరోజు రూ.59,130 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, ఈ ఒక్కరోజే రూ.870 రూపాయలు పడిపోయినట్లు మనం చూడవచ్చు.

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు బంగారం ధర చూస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,200 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,130 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,200 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,130 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,350 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.59,280 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన నగరాల కంటే కోయంబత్తూర్ లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు కోయంబత్తూర్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,700 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,670 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo