ప్రముఖ మొబైల్ యాక్సర్సరీస్ తయారీ కంపెనీ promate, ఈరోజు ఇండియాలో తన మొదటి TWS ని విడుదల చేసింది. అదే, TWS Lush ఇయర్ బడ్స్ మరియు ఈ బడ్స్ జెశ్చర్ కంట్రోల్ ఇంటెలిజెన్స్ తో వస్తుందని ప్రోమేట్ తెలిపింది. ఈ ఇయర్ బడ్స్ ఈరోజు నుండి అన్ని ప్రధాన రిటైల్ స్టోర్ లలో లభిస్తుంది. ఈరోజే ఇండియాలో విడుదలైన ఈ కొత్త ఇయర్ బడ్స్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
TWS Lush: ధర&ఫీచర్లు
ప్రోమేట్ ఈరోజు ఇండియాలో తన TWS Lush ను రూ.1,699 ధరతో లాంచ్ చేసింది. ఈ TWS ఇయర్ బడ్స్ ఈరోజు నుండి అన్ని ప్రధాన రిటైల్ స్టోర్స్ నుండి అందుబాటులో ఉంటాయి.
ఇక ఈ TWS Lush విషయానికి వస్తే, ఈ బడ్స్ జెశ్చర్ కంట్రోల్ ఇంటెలిజెన్స్ తో వస్తుంది. ఈ ఇయర్ బడ్స్ బ్లూటూత్ 5.1 సపోర్ట్ తో వస్తుంది మరియు కేస్ నుండి బయటికి తీసిన వెంటనే మీ కనెక్ట్ అవుతుంది మరియు బడ్స్ ను కేస్ లో పెట్టిన వెంటనే డిస్ కనెక్ట్ అవుతుంది. ఇందులో అందించిన BASS UP టెక్నాలజీ లో ఫ్రీక్వెన్సీ అనాలసిస్ చేసి అదే సమయంలో ఆంప్లిఫై చేస్తుందని కంపెనీ తెలిపింది. తద్వారా, ఈ బడ్స్ మంచి బాలన్స్ తో BASS ను అందిస్తుంది.
ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే, పూర్తి ఛార్జింగ్ కేస్ తో 20 గంటల ప్లే బ్యాక్ అందిస్తుంది మరియు ఇందులో అందించిన టచ్ సెన్సార్స్ తో మ్యూజిక్ మరియు కాల్స్ ని కంట్రోల్ చేయవచ్చు. ఈ బడ్స్ IPX5 తో హై లెవల్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది.