Smart TV: మి టీవీ 6 ఎక్స్ ట్రీమ్ ఇది టీవీ కాదు.. అంతకు మించి…!
Mi TV 6 Extreme టీవీ కన్నా మించిన ఫీచర్లతో వచ్చింది
ఇంటిని షేక్ చేయగల 100 W సౌండ్ అవుట్ పుట్
డ్యూయల్ కెమెరా సిస్టమ్
ఇటీవల షియోమి చైనాలో ప్రకటించిన Mi TV 6 Extreme టీవీ, ఒక టీవీ కన్నా మించిన ఫీచర్లతో వచ్చింది. ఈ మి టీవీ 6 ఎక్స్ ట్రీమ్ స్మార్ట్ టీవీ మీ ఇంటిని షేక్ చేయగల 100 W సౌండ్ అవుట్ పుట్ కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు లేటెస్ట్ టెక్నాలజీ ప్రాసెసర్ మరియు డిస్ప్లే తో మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ మి టీవీ 6 ఎక్స్ ట్రీమ్ స్మార్ట్ టీవీ స్మార్ట్ ఫోన్ల మాదిరిగా డ్యూయల్ కెమెరా సిస్టమ్ ను కలిగివుంది. ఈ టీవీ 48MP డ్యూయల్ కెమెరా సెటప్ తో వచ్చింది.
Surveyమి టీవీ 6 ఎక్స్ ట్రీమ్: ఫీచర్లు
లేటెస్ట్ గా చైనాలో విడుదలైన ఈ షియోమి స్మార్ట్ టీవీ మి టీవీ 6 ఎక్స్ ట్రీమ్ అమోఘమైన ఫీచర్లతో వచ్చింది. మి టీవీ 6 ఎక్స్ ట్రీమ్ స్మార్ట్ టీవీ QHD రిజల్యూషన్ తో వుంటుంది. అంతేకాదు, ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 4K డిస్ప్లే ని కలిగి ఉంటుంది. ఈ షియోమి లేటెస్ట్ స్మార్ట్ టీవీ 4.5 GB ర్యామ్ మరియు 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి మీడియా టెక్ 8KTV పవర్ ఫుల్ ప్రొసెసర్ తో వస్తుంది.
ఇక సౌండ్ పరంగా, ఈ టీవీ DTS-X మరియు Dolby Atmos రెండింటికి సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఈ టీవీ లలో రెండు 100 W హెవీ సౌండ్ కూడా అందుతుంది. అదీకూడా 4.1.2 సిస్టం తో అందించింది. అంటే, ఎటువంటి హోమ్ థియేటర్ సిస్టం అవసరం లేకుండా Deep Bass మరియు సరౌండ్ సౌండ్ ని కూడా ఆస్వాదించవచ్చు. ఈ టీవిలో రెండు వైపులా 2 + 2 స్పీకర్లు, ఒక ఉఫర్ మరియు టీవీకి పైన వైపున రెండు స్పీకర్లు ఉంటాయి.
మి టీవీ 6 ఎక్స్ ట్రీమ్ టీవీ లో మరొక ప్రత్యేకత ఉంది. అదే ఈ టీవీ లో అందించిన డ్యూయల్ 48ఎంపీ పాప్ అప్ కెమెరా. ఈ కెమెరా సహాయంతో వీడియో కాలింగ్ తో పాటుగా ఆన్లైన్ క్లాసుల వంటి అన్ని స్మార్ట్ అవసరాలకు ఉపయోగపడుతుంది.
ఈ షియోమి టీవీలో మీకు మల్టి కనెక్టివిటీ లభిస్తుంది. ఇందులో, WiFi 6 సపోర్ట్ , HDMI 2.0 మరియు eARC తో పాటుగా 2USB పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇది Android మరియు PatchWall OS తో పనిచేస్తుంది.