ఫ్లిప్‌కార్ట్ నుండి స్టూడెంట్ ల్యాప్‌టాప్ పైన అధిక డిస్కౌంట్

HIGHLIGHTS

ఆన్లైన్ ప్లాట్ఫారమ్స్ పైన డిస్కౌంట్ ఆఫర్లతో ల్యాప్‌టాప్స్

ఫ్లిప్‌కార్ట్ నుండి స్టూడెంట్ ల్యాప్‌టాప్స్ పైన డిస్కౌంట్

ల్యాప్‌టాప్స్ పైన 35% కు పైగా డిస్కౌంట్ అఫర్

ఫ్లిప్‌కార్ట్ నుండి స్టూడెంట్ ల్యాప్‌టాప్ పైన అధిక డిస్కౌంట్

ఇప్పటికి కూడా ఆన్లైన్ క్లాసులు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే, అన్ని ఆన్లైన్ ప్లాట్ఫారమ్స్ పైన డిస్కౌంట్ ఆఫర్లతో ల్యాప్‌టాప్స్ లభిస్తున్నాయి. అయితే, ఫ్లిప్‌కార్ట్ నుండి స్టూడెంట్ ల్యాప్‌టాప్స్ పైన 35% కు పైగా డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అందుకే, కొన్ని స్టూడెంట్ ల్యాప్‌టాప్స్ ఈ డిస్కౌంట్ తరవాత చవక ధరకే లభిస్తున్నాయి. స్టూడెంట్ ల్యాప్‌టాప్ డీల్స్ లో బెస్ట్ 3 డీల్స్ ఈ క్రింద చూడవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Lenovo E41

అఫర్ ధర : రూ .22,490

ఈ లెనోవా ల్యాప్‌టాప్ ‌ను ఈ రోజు ఫ్లిప్‌కార్ట్‌లో ఉత్తమ ధరకు విక్రయిస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ .34,680. అయితే, ఈ రోజు దీనిని రూ .22,490 కు కొనవచ్చు. ఈ లెనోవా ల్యాప్‌టాప్ లో 4 జీబీ ర్యామ్, 1 టీబీ HDD స్టోరేజ్ ఉన్నాయి. ఇది 14 – అంగుళాల HD LED స్క్రీన్‌ను కలిగి ఉంది మరియు బ్లాక్ కలర్ లో లభిస్తుంది. అదనంగా, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.   

Acer One 14 Pentium Gold

అఫర్ ధర: రూ .23,990

ఈ ఎసెర్ ల్యాప్ ‌టాప్ ఫ్లిప్‌కార్ట్ లో మంచి డిస్కౌంట్ తో అమ్ముడవుతోంది. ఈ ఏసర్ వన్ 14 పెంటియం గోల్డ్ యొక్క అసలు ధర రూ .37,500. అయితే, ఈ రోజు దీనిని ఫ్లిప్ ‌కార్ట్ రూ .23,990 రూపాయల ఆఫర్ ధరకే కొనుగోలు చేయవచ్చు. అంటే మీరు ఈ ల్యాప్‌ టాప్‌ పైన  36% తగ్గింపు పొందుతారు. మీరు ఈ ల్యాప్‌ టాప్‌ ను EMI ఆఫర్ ‌పై కూడా కొనుగోలు చేయవచ్చు, దీని కోసం మీరు నెలకు 2,499 రూపాయలు చెల్లించాలి.ఇది 4 జిబి ర్యామ్ మరియు 1టీబీ HDD స్టోరేజ్‌తో వస్తుంది. మీకు 14 -అంగుళాల HD LED బ్యాక్‌లైట్ స్క్రీన్ తో   లభిస్తుంది.

Avita Pura Ryzen 5

అఫర్ ధర: రూ .30,190

మీరు మంచి ల్యాప్‌టాప్ ను రూ .30,000 ధరలో కొనాలనుకుంటే, ఈ జాబితాలో ఇవ్వబడిన తదుపరి అవిటా ప్యురా ల్యాప్ ‌టాప్ మీ కోసం ఒక ఎంపిక కావచ్చు. మీరు ఈ ల్యాప్ ‌టాప్ ‌ను ఫ్లిప్‌ కార్ట్ ‌లో రూ .30,190 కు కొనుగోలు చేయవచ్చు. ల్యాప్‌ టాప్‌ లో 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్, 14-ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉన్నాయి. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo