శామ్సంగ్ కంపెనీ భావిష్యత్ ని దృష్టిలో ఉంచుకొని విరగడానికి వీలులేని కొత్తరకం OLED ప్యానెల్స్ ని ఆవిష్కరించింది

HIGHLIGHTS

శామ్సంగ్ యొక్క కొత్త 'అన్ బ్రేకబుల్ ప్యానల్' అండర్ రైటర్స్ లేబోరేటరీ చేత ఆమోదించబడినది , స్మార్ట్ ఫోన్లు ,ఆటోమొబైల్ కన్సోల్ ,మొబైల్ మిలటరీ పరికరాలు ,పోర్టబుల్ గేమ్ కన్సోల్ మరియు టాబ్లెట్ల వంటి చాలా రకాల ఎలక్ట్రానిక్ పరికరాలలో దీనిని ఉపయోగించుకొనే వీలుంది.

శామ్సంగ్ కంపెనీ భావిష్యత్ ని దృష్టిలో ఉంచుకొని విరగడానికి వీలులేని కొత్తరకం OLED ప్యానెల్స్ ని ఆవిష్కరించింది

ఒక మడతపెట్టగల స్మార్ట్ ఫోన్ గురించి చర్చించిన విధంగా, శామ్సంగ్ కంపెనీ అండర్ రైటర్స్ లేబోరేటరీ చేత ఆమోదించబడిన OLED ప్యానెల్ ని  విడుదల చేసింది . యూ ఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ యొక్క లేబర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ మరియు హెల్త్ అడ్మినిస్ట్రేషన్ (OSHA) కోసం కంపెనీ  అధికారికంగా కూడా పరీక్షించారు పరీక్షించారు. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ డిస్ప్లేను స్మార్ట్ ఫోన్లు ,ఆటోమొబైల్ కన్సోల్ ,మొబైల్ మిలటరీ పరికరాలు ,పోర్టబుల్ గేమ్ కన్సోల్ మరియు టాబ్లెట్ల వంటి వాటిలో ఉపయోగపడుతుందని ఈ సౌత్ కొరియా దిగ్గజం తెలిపింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ డిస్ప్లే లో విరిగిపోకుండా వంచడానికి అనువుగా  ఉండే విధంగా దీని ఉపరితలాన్ని తయారుచేసారు ఇంకా దీనిని సురక్షితంగా ఉండేలా ఓవర్లే విండో తో జతపరిచారు . ప్రస్తుత తరానికి చెందిన ఈ మడతపెట్టగల డిస్ప్లేలు ఒక గ్లాస్ – క్లవర్డ్ విండో తో జతపరిచారు దీని వలన పెళుసుదనాన్ని అరికట్టవచ్చు . "ఈ ఫోర్టిఫైడ్ ప్లాస్టిక్ విండో అనేది కేవలం విరగకుండా ఉండడం వల్లనే ఇది ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుకూలంగా ఉంటుంది  అనుకోవడమే కాకుండా దీని యొక్క తేలికైన బరువు ,కాంతిప్రసారా గుణం  మరియు గట్టిదనం అన్నీకూడా దాదాపుగా గ్లాస్ కి సమానంగా ఉండడం వలెనే ఇది అనువుగా ఉంటుందని శామ్సంగ్ డిస్ప్లేకంపెనీ తెలిపింది. 

 శామ్సంగ్ కంపెనీ యొక్క ఈ అన్ బ్రేకబుల్ OLED ప్యానెల్స్ ఎటువంటి  స్మార్ట్ ఫోన్లకు వర్తిస్తుందో  ఇప్పటివరకు వివరించలేదు , కానీ రాబోయే సంవత్సరంలో తయారుచేసే ప్రధాన పరికరాలలో శామ్సంగ్  దీని పొందుపరిచే వీలుంది . సౌత్ కొరియా దిగ్గజం అయిన ఈ కంపెనీ డిస్ప్లే వ్యాపారం లో కీలక పాత్ర పోషిస్తుంది ఇంకా  ఆపిల్ మరియు షియోమీ లాంటి కంపెనీలతో పాటుగా కొన్ని ఇతర కంపెనీ లు కూడా శామ్సంగ్ డిస్ప్లే ని ఉపయోగించు కుంటున్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo