4GB RAM, 128GB స్టోరేజ్ మరియు డ్యూయల్ కెమెరా సెటప్తో భారతదేశంలో ఈ కొత్త స్మార్ట్ఫోన్ ప్రారంభించబడింది

4GB RAM, 128GB స్టోరేజ్ మరియు డ్యూయల్  కెమెరా సెటప్తో భారతదేశంలో ఈ కొత్త స్మార్ట్ఫోన్ ప్రారంభించబడింది

ఫ్లాగ్షిప్  V సిరీస్ ని  విస్తరించడంతో, LG ఎలక్ట్రానిక్స్ భారతదేశం V30 ప్లస్ స్మార్ట్ఫోన్ను రూ. 44,990 లకు  బుధవారం ప్రారంభించింది, ఇది Amazon.com లో సేల్ కి అందుబాటులో ఉంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ డివైస్ కి  6-అంగుళాల QHD ప్లస్ డిస్ప్లే ఉంది, దీని యాస్పెక్ట్ రేషియో  18: 9. LG ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కిమ్ వాన్ ఒక ప్రకటనలో ఈ విధంగా వ్యాఖ్యానించారు. "V30 ప్లస్ కొన్ని గొప్ప ఫీచర్స్  కలయిక, ఇది అన్ని టెక్ ప్రేమికులను ఆకర్షిస్తుంది ".ఈ పరికరానికి డ్యూయల్ కెమెరా మాడ్యూల్ ఉంది, ఇది 16-మెగాపిక్సెల్ స్టాండర్డ్ యాంగిల్  సెన్సార్ మరియు 13-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్  సెన్సర్ను కలిగి ఉంది. ఆప్టికల్, ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలిజేషన్ (EIS) మరియు హైబ్రిడ్ ఆటో ఫోకస్ సపోర్ట్ తో వుంది .ఈ ఫోన్లో F1.6 ఎపర్చర్ యొక్క కెమెరా లెన్స్ ఉంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835 చిప్సెట్తో 4 జీబి ర్యామ్, 128 జీబి ఆన్బోర్డ్ స్టోరేజ్ ఉన్నాయి. ఇది డ్యూయల్ సిమ్ కు మద్దతు ఇస్తుంది మరియు ఒక 3,300 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది, ఇది వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్తో అమర్చబడి ఉంటుంది.

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo