Oppo Reno 15 Mini Price: ఒప్పో అప్ కమింగ్ ఫోన్ ప్రైస్ ముందే లీక్ అయ్యింది.!

HIGHLIGHTS

ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ కంటే ముందే ప్రైస్ లీక్ అయ్యింది

ప్రముఖ టిప్స్టర్ అభిషేక్ యాదవ్ ఈ ఫోన్ ప్రైస్ ను ఎక్స్ క్లూజివ్ గా రివీల్ చేశారు

ఈ ఫోన్ ప్రైస్ బాక్స్ ప్రైస్ మరియు సెల్లింగ్ ప్రైస్ వివరాలు తన x అకౌంట్ నుంచి షేర్ చేశారు

Oppo Reno 15 Mini Price: ఒప్పో అప్ కమింగ్ ఫోన్ ప్రైస్ ముందే లీక్ అయ్యింది.!

Oppo Reno 15 Mini Price Leak: ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ కంటే ముందే ఈ ఫోన్ ప్రైస్ ఆన్లైన్ లో లీక్ అయ్యింది. ఇదేదో గాలి కబుర్లు అనుకునేవారు ఉన్నారు. కానీ, ప్రముఖ టిప్స్టర్ అభిషేక్ యాదవ్ ఈ ఫోన్ ప్రైస్ ను ఎక్స్ క్లూజివ్ గా రివీల్ చేశారు. అంటే, ఇది నిజమయ్యే అవకాశాలు ఎక్కువ మరియు ఇదే ప్రైస్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేస్తుందని కూడా చాలా కన్ఫర్మ్ కూడా చేశారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Oppo Reno 15 Mini Price Leak

ముందుగా తెలిపినట్లు, ప్రముఖ టిప్స్టర్ అభిషేక్ యాదవ్ ఈ ఫోన్ ప్రైస్ బాక్స్ ప్రైస్ మరియు సెల్లింగ్ ప్రైస్ వివరాలు తన x అకౌంట్ నుంచి షేర్ చేశారు. ఈ ఫోన్ ఇండియా వేరియంట్ బాక్స్ పై రూ. 64,999 రూపాయల ధర ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, ఇది రూ. 59,999 ధరతో లాంచ్ అవకాశం ఉందని తెలిపారు. ఇది 12GB + 256GB వేరియంట్ కోసం నిర్ణయించిన ధర అని కూడా ఆయన పేర్కొన్నారు. అంటే, ఇది ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ కావచ్చని మరియు ఈ ఫోన్ రూ. 59,999 బేసిక్ ప్రైస్ కావచ్చని ఈ ;లీక్ చెబుతోంది.

Oppo Reno 15 Mini : లీక్డ్ ఫీచర్స్

ఒప్పో రెనో 15 మినీ వేరియంట్ ఫీచర్స్ కూడా అభిషేక్ యాదవ్ ముందుగా లేక్ చేశారు. ఈ లీక్స్ ప్రకారం, ఈ ఫోన్ 6.32 ఇంచ్ కాంపాక్ట్ LTPS OLED డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1400 నిట్స్ HBM బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 8450 చిప్ సెట్ తో లాంచ్ అవుతుందని ఈ లీక్స్ తెలిపాయి.

కేవలం చిప్ సెట్ మరియు డిస్ప్లే మాత్రమే కాదు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పూర్తి కెమెరా వివరాలు కూడా లీక్ అయ్యాయి. ఈ ఫోన్ లో వెనుక 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ మరియు జతగా 50MP టెలిఫోటో పోర్ట్రైట్ రియర్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 50MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కాంపాక్ట్ సైజులో కూడా 6200 mAh బ్యాటరీ కలిగి ఉంటుందని లీక్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ వేగవంతమైన 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుందని చెబుతున్నారు.

Also Read: Cyber Crime మోసాలతో ప్రతి రోజు ప్రజలు పోగొట్టుకునే డబ్బు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు.!

ఆశ్చర్యం ఏమిటంటే, ఒప్పో రెనో 15 సిరీస్ లాంచ్ డేట్ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ ఈ ఫోన్ స్పెక్స్ మరియు ప్రైస్ సైతం ఆన్లైన్ లో లీక్ అయ్యాయి. మరి కంపెనీ అఫీషియల్ గా ఎటువంటి వివరాలు అందిస్తుందో చూడాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo