Cyber Crime మోసాలతో ప్రతి రోజు ప్రజలు పోగొట్టుకునే డబ్బు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు.!
Cyber Crime ఈరోజు గూగుల్ ట్రెండ్స్ లో ప్రధాన ట్రెండ్ గా నడుస్తోంది
సైబర్ మోసాలతో ప్రతి రోజు ప్రజలు పోగొట్టుకునే డబ్బు ఎంతో తెలిస్తే మీరు కూడా నోరెళ్లబెడతారు
సైబర్ క్రైమ్ పై ప్రత్యేక కథనం అందించాము
Cyber Crime ఈరోజు గూగుల్ ట్రెండ్స్ లో ప్రధాన ట్రెండ్ గా నడుస్తోంది. దేశంలో అధికంగా ప్రజలు వెతికే లేదా ఇంట్రెస్ట్ తో వచ్చే న్యూస్ లో బెస్ట్ ట్రెండ్ ను గూగుల్ ట్రెండ్ లో హైలైట్ చేస్తుంది. అయితే, ఈరోజు అనుహ్యంగా ‘సైబర్ క్రైమ్’ టాప్ ట్రెండ్ గా నిలిచింది. దేశంలో ఇప్పుడు సైబర్ క్రైమ్ తారాస్థాయికి చేరుకున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయం పై మరింత లోతుగా చూస్తే, ప్రతి రోజు సైబర్ క్రైమ్ దెబ్బకు ప్రజలు భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. సైబర్ మోసాలతో ప్రతి రోజు ప్రజలు పోగొట్టుకునే డబ్బు ఎంతో తెలిస్తే మీరు కూడా నోరెళ్లబెడతారు. అందుకే, సైబర్ క్రైమ్ పై ప్రత్యేక కథనం అందించాము.
SurveyCyber Crime
గతంలో కేవలం హ్యాకర్లు, పెద్ద కంపెనీలు మరియు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే ఈ సైబర్ క్రైమ్ అనేది పరిమితంగా ఉండేది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని ప్రతి ఒక్కరి ఇంటికి చేరుకుంది. సైబర్ మోసాల గురించి సరైన అవగాహన లేకపోవడం మరియు నేరగాళ్లు కొత్త కొత్త టెక్నాలజీతో మోసాలకు తెగబడటం, ఈ మోసాల సంఖ్య పెరగడానికి కారణం అవుతున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటి వరకు అందిన అధికారిక లెక్కల ప్రకారం, సైబర్ క్రైమ్ దెబ్బకు మోసపోయిన మరియు మోసపోతున్న వారి సంఖ్య తారా స్థాయికి చేరుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరియు Indian Cyber Crime Coordination Centre (I4C) అందించిన లెక్కల ప్రకారం, సైబర్ క్రైమ్ దెబ్బకు కేవలం 2024 ఒక్క సంవత్సరంలోనే 22,845.73 కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోయినట్లు అధికారిక లెక్కలు ఉన్నాయి. అంటే, సైబర్ క్రైమ్ మోసాల దెబ్బకి రోజుకు సగటున 62.6 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ప్రజలు పోగొట్టుకున్నారు. అయితే, ఇది 2025 సంవత్సరంలో రెట్టింపు దాటుకొని మరింత ఎక్కువ సంఖ్య నమోదు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఒక 2025 సంవత్సరం అర్ధ భాగం వరకు వేసిన లెక్కల ప్రకారం, దేశంలో రోజుకు 46 కోట్లు నుంచి 65 కోట్ల రూపాయల వరకు సైబర్ క్రైమ్ మోసాలు జరుగుతున్నట్లు చెప్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో కూడా రోజుకు సగటున 4 కోట్ల రూపాయల వరకు సైబర్ క్రైమ్ మోసాలు జరుగుతున్నట్లు కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి.
Also Read: Samsung Galaxy A35 5G: ఫ్లిప్ కార్ట్ సేల్ చివరి రోజు ఆల్ టైం చవక ధరలో లభిస్తోంది.!
టెక్నాలజీ పెరిగింది, భద్రత మాటేమిటి?
బ్యాంకింగ్ సేవలు మొదలుకొని వీడియో కాల్స్ వరకు టెక్నాలజీ చాలా అడ్వాన్స్ లెవల్ కి మారిపోయింది. అయితే, భద్రతా మాత్రం కరువయ్యింది. ఇది సర్వీస్ లోపం కన్నా అవగాహన లోపం ఎక్కువగా కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, చాలా కాలంగా ఫేక్ లింక్ SMS మరియు ఇతర సైబర్ క్రైమ్ మోసాల గురించి ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి ప్రభుత్వం ”సైబర్ క్రైమ్ పోర్టల్’ వంటి అనేక పద్ధతులు చేపట్టింది. అంతేకాదు, ఈ మోసాలకు చెక్ పెట్టడానికి, PAN ఆధార్ లింక్, కాలర్ ఒరిజినల్ పేరు వచ్చేలా కొత్త డిస్ప్లే ఫీచర్ వంటివి చేపట్టింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు ఈ మోసాల పై అవగాహన కలిగి ఉండకపోతే పూర్తి ప్రయోజనం ఉండదు.
ఈ సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండటానికి ప్రజలు మంచి అవగాహన కలిగి ఉండాలి. తెలియని కొత్త వ్యక్తులు పంపించే లింక్స్ పై క్లిక్ చేయకపోవడం, వాట్సాప్ లో తెలియని వారి మేసే లేదా వీడియో కాల్ కి రెస్పాండ్ కాకపోవడం వంటివి అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా, డిజిటల్ అరెస్ట్ అని కాల్ వస్తే వాటిని అసలు నమ్మకూడదు.