200MP కెమెరా ఫోన్ vivo V60e పై రూ. 5,000 భారీ డిస్కౌంట్ అందించిన ఫ్లిప్ కార్ట్.!

HIGHLIGHTS

vivo V60e పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ సూపర్ డీల్స్ అందించింది

భారీ డీల్స్ తో కేవలం 25 వేల రూపాయల ధరలో మీకు లభిస్తుంది

200MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది

200MP కెమెరా ఫోన్ vivo V60e పై రూ. 5,000 భారీ డిస్కౌంట్ అందించిన ఫ్లిప్ కార్ట్.!

vivo V60e స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ సూపర్ డీల్స్ అందించింది. ఇటీవల విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బై బై 2025 సేల్ నుంచి అందించిన భారీ డీల్స్ తో కేవలం 25 వేల రూపాయల ధరలో మీకు లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 200MP జబర్దస్త్ కెమెరా, స్టన్నింగ్ డిజైన్ మరియు భారీ బ్యాటరీ వంటి మరిన్ని ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. కొత్త ఫోన్ కోసం సెర్చ్ చేస్తుంటే ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డీల్ ని పరిశీలించవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

vivo V60e : ఫ్లిప్ కార్ట్ డీల్

వివో వి60e స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 29,999 ధరతో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు కూడా ఇదే ప్రైస్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ మిడ్ వేరియంట్ రూ. 31,999 ధరతో మరియు హై ఎండ్ వేరియంట్ రూ. 33,999 ధరతో లిస్ట్ అయ్యాయి. ఈ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ రెండు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఇందులో ఒకటి బ్యాంక్ డిస్కౌంట్ మరియు రెండోది ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్.

vivo V60e Flipkart Offer

ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను ఎంపిక చేసిన క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను ఎక్స్ చేంజ్ ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,500 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 24,999 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ తో మీ సొంతం చేసుకోవచ్చు.

Also Read: Starlink Plan Price: ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ ప్లాన్ ధర విడుదల చేసిన ఎలాన్ మస్క్.!

vivo V60e : ఫీచర్స్

ఈ వివో స్మార్ట్ ఫోన్ కెమెరా ప్రత్యేకమైన ఫోన్ మరియు ఇందులో 200MP మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ కెమెరా గొప్ప జూమ్, 4K వీడియో రికార్డింగ్, 85mm క్లోజప్ పోర్ట్రైట్ ఫోటోగ్రఫీ మరియు AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ వివో ఫోన్ 6.77 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది మరియు ఈ స్క్రీన్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, FHD+ మరియు HDR10+ రిజల్యూషన్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ ను మీడియాటెక్ 4nm చిప్ సెట్ Dimensity 7360-Turbo తో అందించింది మరియు దీనికి జతగా 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ వివో ఫోన్ 6500 mAh బిగ్ బ్యాటరీ మరియు 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంటుంది. నీరు మరియు దుమ్మును తట్టుకునే IP68 అండ్ IP69 రేటింగ్ తో ఈ ఫోన్ వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo