Jio Free Offer: జియో సిమ్ వాడుతుంటే ఈ 18 నెలల ఉచిత ఆఫర్ ఇప్పుడే అందుకోండి.!
జియో యూజర్లకు ఉచిత ఆఫర్స్ పేరు వినడం మరియు ఉచిత ఆఫర్స్ అందుకోవడం కొత్తేమి కాదు
రిలియన్స్ జియో తన యూజర్లకు ఇప్పటికే చాలా ఉచిత ఆఫర్స్ ఎన్నో అందించింది
జియో అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్ల కోసం జియో ఈ ఉచిత ఆఫర్ అందించింది
Jio Free Offer: రిలయన్స్ జియో యూజర్లకు ఉచిత ఆఫర్స్ పేరు వినడం మరియు ఉచిత ఆఫర్స్ అందుకోవడం కొత్తేమి కాదు. రిలియన్స్ జియో తన యూజర్లకు ఇప్పటికే చాలా ఉచిత ఆఫర్స్ ఎన్నో అందించింది మరియు ఇప్పుడు కూడా మరో గొప్ప ఉచిత ఆఫర్ తీసుకొచ్చింది. ఈ ఆఫర్ తో రూ. 35,100 విలువైన ప్రయోజనాలు యూజర్లు అందుకోవచ్చు. మరి ఆ ఉచిత ఆఫర్ ఏమిటో ఆ ఆఫర్ తీసుకొచ్చే ప్రయోజనాలు ఏమిటో చూద్దామా.
SurveyJio Free Offer ఏమిటి?
రిలయన్స్ జియో అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్ల కోసం జియో ఈ ఉచిత ఆఫర్ అందించింది. జియో నెంబర్ వాడుతూ అన్లిమిటెడ్ 5జి ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు ఈ ఉచిత ఆఫర్ లభిస్తుంది. అదేమిటంటే, అద్భుతమైన ఇమేజ్ మరియు వీడియో క్రియేట్ చేసే సత్తాతో పాటు తార్కిక శక్తి తో గూగుల్ అందించిన జెమిని AI ప్రో యొక్క ఉచిత యాక్సెస్ జియో అన్లిమిటెడ్ 5జి ప్లాన్ తో పాటు జతగా అందించింది.

జియో అన్లిమిటెడ్ 5జి ప్రీపెయిడ్ ప్లాన్స్ తో రీఛార్జ్ చేసే 18 సంవత్సరాలు పై బడిన కస్టమర్లు అందరికి గూగుల్ జెమినీ ప్రో 18 నెలల యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. రిలయన్స్ జియో రూ. 349 రూపాయల నుంచి ప్రారంభమయ్యే ప్లాన్ పై ఈ ఉచిత ఆఫర్ లభిస్తుంది. క్లియర్ గా చెప్పాలంటే 14 ప్రీపెయిడ్ ప్లాన్స్ మీకు గూగుల్ జెమినీ AI ఉచిత యాక్సెస్ తో అందుబాటులో ఉన్నాయి. ఇందులో వన్ మంత్ నుంచి వన్ ఇయర్ వరకు వ్యాలిడిటీ అందించే ప్లాన్స్ ఉన్నాయి. మీ బడ్జెట్ ను బట్టి ఏదైనా ఒక ప్లాన్ మీరు ఎంచుకోవచ్చు.
Also Read: లేటెస్ట్ టాప్ రేటెడ్ 65 ఇంచ్ QLED Smart TV ని కేవలం 34 వేల ధరలో అందుకోండి.!
గూగుల్ జెమిని AI ప్రో బెనిఫిట్స్ ఏమిటి?
గూగుల్ జెమినీ ప్రో 18 నెలల యాక్సెస్ తో మీకు గూగుల్ ప్రీమియం బెనిఫిట్స్ లభిస్తాయి. ఇందులో సూపర్ ఇమేజ్ క్రియేటర్ నానో బనానా ప్రో యాక్సెస్, AI సహాయంతో మీరు కోరుకునే హై క్వాలిటీ వీడియోలు క్రియేట్ చేసే Veo 3.1 యాక్సెస్ కూడా లభిస్తుంది. ఇదే కాదు గూగుల్ డీప్ రీసెర్చ్, సినిమాటిక్ ఫిలిం మేకింగ్ టూల్ Flow మరియు ఇమేజ్ నుంచి వీడియో క్రియేట్ చేసే Whisk యాక్సెస్ కూడా మీకు అందుతుంది. అలాగే, NotebookLM వంటి మరిన్ని ఫీచర్లు ఈ గూగుల్ జెమినీ ఉచిత యాక్సెస్ తో అందుకోవచ్చు.
వాస్తవానికి 18 నెలల గూగుల్ జెమినీ ప్రో యాక్సెస్ పొందాలంటే మీరు రూ. 35,100 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, జియో అన్లిమిటెడ్ 5జి ప్రీపెయిడ్ ప్లాన్స్ తో ఈ ఫీచర్ మీరు ఇవన్నీ కూడా ఉచితంగా పొందవచ్చు. అంతేకాదు, గూగుల్ వన్ మరియు గూగుల్ ఫోటోస్ కోసం మీకు 2TB క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది.