పెద్ద స్మార్ట్ టీవీ అందులోనూ మంచి రేటింగ్ తో పాటు మంచి ఫీచర్స్ కలిగిన స్మార్ట్ టీవీ కొనాలని సెర్చ్ చేస్తుంటే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు. మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో లేటెస్ట్ టాప్ రేటెడ్ 65 QLED Smart TV ని కేవలం 34 వేల ధరలో ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ మరియు ఫీచర్స్ ఏమిటో ఒక లుక్కేయండి.
Survey
✅ Thank you for completing the survey!
65 ఇంచ్ QLED Smart TV : డీల్
ప్రముఖ బడ్జెట్ స్మార్ట్ టీవీ బ్రాండ్ Thomson యొక్క 65 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఎందుకంటే, థాంసన్ 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ (Q65H1100) పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు 57% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 35,999 ధరకే ఆఫర్ చేస్తోంది. ఈ టీవీ పై BOB CARD EMI మరియు Flipkart SBI క్రెడిట్ కార్డ్ పై రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది.
ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ ఈరోజు కేవలం రూ. 34,499 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో లభించే 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్స్ లో ఇది కూడా బెస్ట్ డీల్ గా నిలుస్తుంది. ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.3 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది.
ఈ థాంసన్ స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 65 ఇంచ్ క్యూలెడ్ ప్యానల్ తో వస్తుంది. ఈ ప్యానల్ డాల్బీ విజన్, HDR 10+ మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ ఆఫర్ చేస్తుంది. ఈ థాంసన్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2 జీబీ మరియు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇది బెజెల్ లెస్ స్క్రీన్ కలిగి ఉంటుంది మరియు స్లీక్ డిజైన్ తో ఉంటుంది.
ఈ 65 ఇంచ్ స్మార్ట్ టీవీ రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు టోటల్ 40W సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ మరియు DTS ట్రూ సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కలిగిన రిమోట్ కంట్రోల్ తో వస్తుంది. ఇందులో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, USB, ఆప్టికల్, బ్లూటూత్ HDMI, ఈథర్నెట్ వంటి మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.