OPPO A6x 5G: బిగ్ బ్యాటరీ మరియు బ్రెట్ డిస్ప్లేతో బడ్జెట్ ధరలో రిలీజ్ అయ్యింది.!

HIGHLIGHTS

ఒప్పో ఈరోజు బడ్జెట్ సిరీస్ నుండి కొత్త ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది

ఈ ఫోన్ ను బిగ్ బ్యాటరీ మరియు బ్రెట్ డిస్ప్లేతో బడ్జెట్ ధరలో ఈరోజు రిలీజ్ చేసింది

ఈ ఫోన్ ఐస్ బ్లూ మరియు ఆలీవ్ గ్రీన్ రెండు రంగుల్లో లభిస్తుంది

OPPO A6x 5G: బిగ్ బ్యాటరీ మరియు బ్రెట్ డిస్ప్లేతో బడ్జెట్ ధరలో రిలీజ్ అయ్యింది.!

OPPO A6x 5G : ఒప్పో ఈరోజు బడ్జెట్ సిరీస్ నుండి కొత్త ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ను బిగ్ బ్యాటరీ మరియు బ్రెట్ డిస్ప్లేతో బడ్జెట్ ధరలో ఈరోజు రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ను అండర్ రూ. 15,000 ప్రైస్ సెగ్మెంట్ యూజర్ బేస్ ను టార్గెట్ చేసి లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ ప్రైస్ మరియు ఫీచర్స్ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OPPO A6x 5G: ప్రైస్ అండ్ ఆఫర్లు

ఒప్పో ఎ6x 5జి స్మార్ట్ ఫోన్ బేసిక్ 4 జీబీ + 64 జీబీ వేరియంట్ ను ఇండియాలో రూ. 12,499 రూపాయల బేసిక్ ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ మిడ్ రేంజ్ 4 జీబీ + 128 జీబీ వేరియంట్ ను రూ. 13,499 ధరతో మరియు హైఎండ్ 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ను రూ. 14,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఈరోజు నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మరియు ఒప్పో అఫీషియల్ సైట్ తో పాటు రిటైల్ స్టోర్ నుంచి కూడా సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ఐస్ బ్లూ మరియు ఆలీవ్ గ్రీన్ రెండు రంగుల్లో లభిస్తుంది.

Also Read: Vivo X300 5G ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

OPPO A6x 5G: ఫీచర్స్

ఒప్పో ఎ6X 6 5జి స్మార్ట్ ఫోన్ 6.75 ఇంచ్ HD+ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో అందించిన స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ 1125 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 90.6% స్క్రీన్ టూ బాడీ రేషియో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 6 జీబీ ర్యామ్ తో పాటు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ColorOS 15 యూజర్ ఇంటర్ ఫేజ్ తో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది.

OPPO A6x 5G Features

ఈ లేటెస్ట్ ఒప్పో స్మార్ట్ ఫోన్ 13MP మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు 5MP సెల్ఫీ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా 30FPS వద్ద 1080P వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు మంచి కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 10x డిజిటల్ జూమ్ సపోర్ట్ కూడా వస్తుంది. ఈ ఫోన్ ను 6500 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ చేసింది మరియు ఈ ఫోన్ వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo