Realme P4x : ఫాస్ట్ చిప్ సెట్ మరియు బిగ్ బ్యాటరీతో వస్తుంది.!
రియల్ మీ P సిరీస్ నుంచి లాంచ్ చేయనున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివరాలు అందించింది
Realme P4x కోసం రియల్ మీ టీజింగ్ మొదలు పెట్టింది
ఫాస్ట్ చిప్ సెట్ మరియు బిగ్ బ్యాటరీతో వస్తోందని రియల్ మీ లేటెస్ట్ టీజర్ నుంచి అనౌన్స్ చేసింది
Realme P4x: రియల్ మీ P సిరీస్ నుంచి లాంచ్ చేయనున్న అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివరాలు అందించింది. అదే, రియల్ మీ పి4x స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ కోసం రియల్ మీ టీజింగ్ మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫాస్ట్ చిప్ సెట్ మరియు బిగ్ బ్యాటరీతో వస్తోందని రియల్ మీ లేటెస్ట్ టీజర్ నుంచి అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ వివరాలు ఏమిటో చూడండి.
SurveyRealme P4x : లాంచ్
రియల్ మీ పి4x స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా రిలీజ్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ టీజింగ్ మాత్రం మొదలు పెట్టింది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అందుకే, రియల్ మీ పి4x స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజీ అందించి టీజింగ్ చేస్తోంది.
Realme P4x : ఫీచర్స్
రియల్ మీ పి4x స్మార్ట్ ఫోన్ 90 FPS వద్ద గేమింగ్ ఆఫర్ చేసే GT మోడ్ మరియు తగిన డిస్ప్లే తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫీచర్ గురించి రియల్ మీ ప్రత్యేకంగా టీజింగ్ చేసింది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ 18 యాప్స్ ను చాలా స్మూత్ గా రన్ చేస్తుందని కూడా రియల్ మీ తెలిపింది. అంటే, ఇది పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు ర్యామ్ సపోర్ట్ తో వస్తుందని చెప్పకనే చెప్పింది.

ఈ ఫోన్ రన్ అయ్యే చిప్ సెట్ విషయానికి వస్తే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ చిప్ సెట్ గురించి హింట్ టీజర్ ను కంపెనీ అందించింది. ఇందులో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ చిప్ సెట్ 10 లక్షల కంటే అధికమైన AnTuTu స్కోర్ అందించే ఫాస్ట్ చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చింది. దీన్ని బట్టి ఈ అప్ కమింగ్ ఫోన్ మీడియాటెక్ Dimensity 8350 చిప్ తో లాంచ్ కావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ 5500 mAh కంటే ఎక్కువ పవర్ కలిగిన బ్యాటరీ తో లాంచ్ అవుతుందని కూడా కంపెనీ హింట్ ఇచింది. దీన్ని బట్టి ఈ ఫోన్ 6000 mAh లేదా 7000 mAh బ్యాటరీ తో వచ్చే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.
Also Read: OnePlus 13 Amazon Deal: ఈ ఆఫర్ మిస్సయితే మళ్ళీ దొరకదేమో భయ్యా.!
ఇక ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా ఉండే అవకాశం ఉండవచ్చు. అంతేకాదు, ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ బైపాస్ ఛార్జ్ ఫీచర్ కలిగిన 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం కూడా ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు కీలక ఫీచర్స్ కూడా త్వరలోనే రియల్ మీ లాంచ్ చేస్తుంది.