120Hz రిఫ్రెష్ రేట్ మరియు Dolby Vision సపోర్ట్ తో కొత్త స్మార్ట్ టీవీలు విడుదల చేసిన Kodak
కొడాక్ ఇండియన్ మార్కెట్ లో మూడు కొత్త స్మార్ట్ టీవీలు విడుదల చేసింది
ఈ స్మార్ట్ టీవీలు ట్రెడిషనల్ 60Hz రిఫ్రెష్ రేట్ తో కాకుండా 120Hz రిఫ్రెష్ రేట్ తో అందించింది
ఈ స్మార్ట్ టీవీలు కొత్త కాలానికి తగిన కొత్త స్పెక్స్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటాయి
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ కొడాక్ ఇండియన్ మార్కెట్ లో మూడు కొత్త స్మార్ట్ టీవీలు విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీలు ట్రెడిషనల్ 60Hz రిఫ్రెష్ రేట్ తో కాకుండా 120Hz రిఫ్రెష్ రేట్ తో అందించింది. ఇది మాత్రమే కాదు ఈ టీవీలలో 70W హెవీ సౌండ్ అందించే క్వాడ్ స్పీకర్ సెటప్ కూడా అందించింది. ఓవరాల్ గా ఈ స్మార్ట్ టీవీలు కొత్త కాలానికి తగిన కొత్త స్పెక్స్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటాయి.
Surveykodak 120Hz Dolby Vision స్మార్ట్ టీవీ ప్రైస్
కొడాక్ కొత్త టీవీల విషయానికి వస్తే, కొడాక్ Motion X సిరీస్ నుంచి 55 ఇంచ్, 65 ఇంచ్ మరియు 75 ఇంచ్ మూడు కొత్త క్యూలెడ్ స్మార్ట్ టీవీలు అందించింది. ఈ మూడు స్మార్ట్ టీవీలు కూడా లేటెస్ట్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఇందులో 55 ఇంచ్ టీవీని రూ. 31,999 ధరతో, 65 ఇంచ్ టీవీని రూ. 43,999 ధరతో మరియు 75 ఇంచ్ టీవీని రూ. 64,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది.
ఈ మూడు స్మార్ట్ టీవీలు కూడా ఫ్లిప్ కార్ట్ నుంచి ప్రత్యేకంగా లభిస్తున్నాయి. ఈ లేటెస్ట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ లపై సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్స్ 10% అదనపు డిస్కౌంట్ ఆఫర్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది.
Also Read: Jio Gemini Offer: ఇప్పుడు జియో యూజర్లు అందరికీ గూగుల్ AI యాక్సెస్ ఉచితం.!
kodak 120Hz Dolby Vision స్మార్ట్ టీవీ ఫీచర్స్
ఈ మూడు స్మార్ట్ టీవీల ఫీచర్స్ కూడా ఒకే విధంగా ఉంటాయి. ఈ టీవీల స్క్రీన్ సైజులో మాత్రమే టెడ్ ఉంటుంది. ఈ టీవీలు 4K UHD రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ కలిగిన A+ గ్రేడ్ క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటాయి. ఈ టీవీలు 550 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటాయి. ఈ టీవీ డాల్బీ విజన్, HDR 10+, HLG, AI మోషన్ X, ప్రెసైజ్ డిమ్మింగ్ మరియు ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ చిప్ సెట్ తో నడుస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ తో పాటు 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డాల్బీ అట్మాస్ మరియు AI క్లియర్ వాయిస్ సౌండ్ టెక్నలాజితో వచ్చింది. ఇది గొప్ప క్లియర్ వోకల్స్ మరియు మంచి బాస్ తో సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఎందుకంటే, ఈ సౌండ్ ఫీచర్స్ కి తగిన క్వాడ్ స్పీకర్ సెటప్ కూడా ఈ టీవీలలో అందించింది, ఈ లేటెస్ట్ కొడాక్ స్మార్ట్ టీవీ టోటల్ 70W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, USB, ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.