vivo X300 Series ఇండియా అనౌన్స్ లాంచ్ చేసిన వివో.!
vivo X300 Series గత వారం చైనా మార్కెట్లో లాంచ్ అయ్యింది
ఈ ఫోన్ లాంచ్ గురించి వివో ఈరోజు టీజర్ విడుదల చేసింది
ఈ ఫోన్ కెమెరా సత్తా తెలిసేలా ఈ ఫోన్ టీజర్ ను విడుదల చేసింది
vivo X300 Series గత వారం చైనా మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ ప్రీమియం సిరీస్ స్మార్ట్ ఫోన్ లను ఇప్పుడు ఇండియాలో కూడా లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ గురించి వివో ఈరోజు టీజర్ విడుదల చేసింది. ఈ ఫోన్ కెమెరా సత్తా తెలిసేలా ఈ ఫోన్ టీజర్ ను విడుదల చేసింది. ఈ అప్ కమింగ్ వివో స్మార్ట్ ఫోన్ గురించి వివో చెబుతున్నారు విశేషాలు చూద్దామా.
Surveyvivo X300 Series ఇండియా లాంచ్ ఎప్పుడు?
వివో ఎక్స్ 300 సిరీస్ ఇండియా లాంచ్ డేట్ ని వివో ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ ఫోన్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ కోసం కమింగ్ సూన్ ట్యాగ్ తో టీజర్ అందించింది. ఈ టీజర్ నుంచి ఈ ఫోన్ కెమెరా ప్రత్యేకత గురించి హింట్ ఇచ్చింది. అంతేకాదు, ఫ్లిప్ కార్ట్ ఈ అప్ కమింగ్ వివో ప్రీమియం సిరీస్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజీ అందించి టీజింగ్ చేస్తోంది.
vivo X300 Series : విశేషాలు ఏమిటి?
వివో ఎక్స్ 300 సిరీస్ కెమెరా గురించి కంపెనీ టీజర్ లో చూపించింది. ఈ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ అఫీషియల్ సైట్ నుంచి అందించిన టీజర్ పేజి నుంచి ఈ ఫోన్ విశేషాలు వెల్లడించింది. ఈ సిరీస్ నుంచి ఎక్స్ 300 మరియు ఎక్స్ 300 ప్రో రెండు ఫోన్లు లాంచ్ చేస్తుంది. ఈ రెండు ఫోన్లు కూడా సరికొత్త మరియు స్టన్నింగ్ డిజైన్ కలిగి ఉన్నాయి. వీటిలో మీడియాటెక్ Dimensity 9500 చిప్ సెట్ ఉంటుంది మరియు జతగా కెమెరా కోసం ప్రత్యేకమైన V1 చిప్ కూడా ఉంటుంది. ఇది అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఆఫర్ చేసే లేటెస్ట్ ప్రీమియం చిప్ సెట్ గా చెప్పబడుతుంది.

కెమెరా పరంగా ఈ ఫోన్ కళ్ళు చెదిరే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఎందుకంటే, ఈ ఫోన్లలో ZEISS కెమెరా సెటప్ అందించింది. ప్రో వేరియంట్ 200 MP ZEISS APO టెలిఫోటో కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ మరియు 50MP (LYT-828) ZEISS గింబాల్ గ్రేడ్ మెయిన్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. రెగ్యులర్ స్మార్ట్ ఫోన్ అందించే ఇమేజ్ లతో పోలిస్తే ఇది చాలా అద్భుతమైన మరియు డిటైల్డ్ ఇమేజెస్ అందిస్తుందని వివో తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ 4K 120fps Dolby Vision వీడియో సపోర్ట్ తో వస్తుంది.
Also Read: OnePlus 15 Price: ఫోన్ అంచనా ప్రైస్ అండ్ కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.!
కేవలం ఈ ఫీచర్స్ మాత్రమే కాదు ఈ ఫోన్ తో జత చేయడానికి వీలైన X300 ప్రో ఫోటోగ్రాఫర్ కిట్ ను పరిచయం చేస్తుంది. ఇది ఈ వివో ఫోన్ ను DSLR లాంటి భారీ జూమ్ తో మరింత శక్తివంతంగా మారుస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆరిజిన్ OS మరియు ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అవుతుంది. వివో ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు మరిన్ని కీలక ఫీచర్లు కూడా త్వరలో వెల్లడిస్తుంది.