Jio జబర్దస్త్ ఆఫర్: యూజర్లకు Gemini Pro ఉచితంగా ప్రకటించిన జియో.!
ఇప్పటికే చాలా ఉచిత ఆఫర్స్ ప్రకటించిన జియో
మరొక కొత్త ఉచిత ఆఫర్ ని కూడా తన యూజర్ల కోసం ప్రకటించింది
గూగుల్ యొక్క జెమిని ప్రో ఎఐ యొక్క ప్రీమియం యాక్సెస్ యూజర్లకు ఉచితం
Jio జబర్దస్త్ ఆఫర్: ఇప్పటికే చాలా ఉచిత ఆఫర్స్ ప్రకటించిన జియో, ఇప్పుడు మరొక కొత్త ఉచిత ఆఫర్ ని కూడా తన యూజర్ల కోసం ప్రకటించింది. ఈ కొత్త ఉచిత ఆఫర్ తో గూగుల్ యొక్క జెమిని ప్రో ఎఐ యొక్క ప్రీమియం యాక్సెస్ యూజర్లకు ఉచితంగా లభిస్తుంది. జియో యూజర్ల కోసం కొత్తగా ప్రకటించిన ఉచిత ఆఫర్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోండి.
SurveyJio జబర్దస్త్ ఆఫర్ ఏమిటీ?
రిలయన్స్ జియో యూజర్లకు ఈసారి కొత్త ఉచిత ఆఫర్ ని అందించింది. రిలయన్స్ జియో అన్లిమిటెడ్ 5జి ప్లాన్ రీఛార్జ్ చేసే యూజర్లకు రూ. 35,100 రూపాయల విలువైన 18 నెలల గూగుల్ జెమినీ ప్రో AI షబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందించింది. అయితే ఈ ఉచిత ఆఫర్ అందరికీ అందుబాటులో ఉండదు. ఈ కొత్త గూగుల్ జెమినీ ప్రీమియం యాక్సెస్ కేవలం 18 నుంచి 25 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారికి మాత్రమే వర్తిస్తుంది.

అయితే, ఈ ఉచిత గూగుల్ జెమినీ యాక్సెస్ అందుకునే యూజర్లు గూగుల్ అనేక AI సర్వీస్ లకు యాక్సెస్ అందుకోవడమే కాకుండా మరిన్ని ఇతర లాభాలు కూడా అందుకుంటారు. గూగుల్ జెమినీ ప్రో తో వచ్చే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
Also Read: ఈరోజు అమెజాన్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ 50 ఇంచ్ QLED Smart Tv డీల్ ఇదే.!
Gemini Pro యాక్సెస్ తో వచ్చే లాభాలు?
జియో కొత్తగా అందించిన ఉచిత ఆఫర్ తో గూగుల్ యొక్క లేటెస్ట్ AI ప్రో వెర్షన్ జెమినీ 2.5 ప్రో, VEO 3.1 AI వీడియో టూల్ యాక్సెస్, 2TB గూగుల్ వన్ స్టోరేజ్ యాక్సెస్, గూగుల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ టూల్ notebookLM మరియు నానో బనానా లకు ఫ్రీ యాక్సెస్ అందిస్తుంది. మీరు ఇప్పటి వరకు మీ గూగుల్ ఫోటోస్ కోసం సబ్ స్క్రిప్షన్ తీసుకొని ఉంటే ఇరాక్ నుంచి ఈ ఉచిత యాక్సెస్ మరింత లాభాలు అందుకోవచ్చు.
మీరు 18 నుంచి 25 సంవత్సరాలు కలిగిన జియో యూజర్ అయితే మై జియో యాప్ నుంచి ఈ ఉచిత ఆఫర్ ని అందుకోండి. ఈ ఆఫర్ చెస్ చేయడానికి మీ జియో అకౌంట్ మెయిన్ పేజీ లో గూగుల్ జెమినీ బ్యానర్ కనిపిస్తే మీకు ఈ ఉచిత యాక్సెస్ కోసం ప్రీ పాస్ లభించినట్లు అవుతుంది.