vivo T4R 5G: భారీ డిస్కౌంట్ తో 17 వేలకే వివో 3D కర్వుడ్ ఫోన్ అందుకోండి.!
vivo T4R 5G డిస్కౌంట్ ఆఫర్ తో తక్కువ ధరకు లభిస్తుంది
ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్ ను ఫ్లిప్ కార్ట్ ఈరోజు బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి అందించింది
ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 17,499 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తుంది
vivo T4R 5G: వివో ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదల చేసిన 3d కర్వుడ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ ఈరోజు ఎన్నడూ లేనంత చవక ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆఫర్ ను ఫ్లిప్ కార్ట్ ఈరోజు బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి అందించింది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ ఫోన్ పై అందించిన భారీ బ్యాంక్ డిస్కౌంట్ మరియు ఇతర డిస్కౌంట్ ఆఫర్ తో ఇంత తక్కువ ధరకు లభిస్తుంది.
Surveyvivo T4R 5G: ఆఫర్లు
వివో టి4ఆర్ 5జి స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 19,499 ఆఫర్ ధరతో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి సెలెక్టెడ్ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఇది కాకుండా మరిన్ని బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 17,499 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తుంది.
Also Read: భారీ డిస్కౌంట్ తో 55 ఇంచ్ టీవీ రేటుకే లభిస్తున్న 65 ఇంచ్ QLED Smart Tv
vivo T4R 5G: ఫీచర్స్
ఈ వివో స్మార్ట్ ఫోన్ 3D క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HDR 10+ సపోర్ట్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 8 జీబీ ర్యామ్ తో పాటు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో వెనుక 50MP (OIS) మరియు 2MP సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్స్ మరియు మంచి కెమెరా డీటెయిల్స్ కలిగి ఉంటుంది. ఈ వివో ఫోన్ 5700 mAh బిగ్ బ్యాటరీ మరియు 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 మరియు IP69 మంచి వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుంది.
ఈ ఫోన్ ను మీరు ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు.