Meta Ray-Ban Display: సైన్స్ ఫిక్షన్ సినిమా తలపించే కొత్త స్మార్ట్ కళ్ళజోడు తెచ్చిన మెటా.!
సైన్స్ ఫిక్షన్ సినిమా తలపించే కొత్త స్మార్ట్ కళ్ళజోడు Meta Ray-Ban Display
మెటా మరియు రేబాన్ సంయుక్తంగా ఇన్ లెన్స్ స్క్రీన్ ఫీచర్ తో ఈ కొత్త స్మార్ట్ కళ్ళజోడు అందించాయి
ఇది కొత్త జనరేషన్ కు తగిన కొత్త ఫీచర్స్ మరియు స్టైల్ కాంబినేషన్ తో ఉంటుంది
Meta Ray-Ban Display: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ పరికరాలకు పెరుగుతున్న ఆదరణకు అనుగుణంగా మెటా మరియు రేబాన్ సంయుక్తంగా ఇన్ లెన్స్ స్క్రీన్ ఫీచర్ తో ఈ కొత్త స్మార్ట్ కళ్ళజోడు అందించాయి. ఈ కొత్త కళ్లజోడు మామూలు కళ్ళజోడు గా కనిపిస్తుంది. అయితే, కోరుకున్నప్పుడు లెన్స్ పై స్క్రీన్ ప్రత్యక్షం అవుతుంది మరియు స్మార్ట్ కళ్ళజోడు గా మారుతుంది. చేతికి ధరించే ఆన్ రిస్ట్ కంట్రోల్ తో ఈ కొత్త స్మార్ట్ గ్లాస్ ని కంట్రోల్ చేసేలా డిజైన్ చేసి అందించింది. ఇది కొత్త జనరేషన్ కు తగిన కొత్త ఫీచర్స్ మరియు స్టైల్ కాంబినేషన్ తో ఉంటుంది.
SurveyMeta Ray-Ban Display:
మెటా మరియు రేబాన్ సంయుక్తంగా ఈ కొత్త గ్లాసెస్ ని అందించాయి. ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది మరియు స్మార్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ కొత్త స్మార్ట్ గ్లాసెస్ యూజర్ కోరుకున్నప్పుడు స్మార్ట్ కళ్ళజోడు గా మారిపోతుంది. డిజైన్ పరంగా ఇది చూడటానికి స్టైలిష్ రేబాన్ సన్ గ్లాసెస్ మాదిరిగా ఉంటుంది. కానీ కోరుకున్నప్పుడు ఈ కళ్ళజోడు లెన్స్ పై స్క్రీన్ ప్రత్యక్షం అవుతుంది. అంటే, ఇది సైన్స్ ఫిక్షన్ లేదా జేమ్స్ బాండ్ సినిమాలలో చూపించే సూపర్ గ్లాసెస్ మాదిరిగా ఉంటుంది.
ఈ కళ్లజోడు లెన్స్ లో అందించిన స్క్రీన్ పై నోటిఫికేషన్, రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్, నావిగేషన్, టెక్స్ట్ ట్రాన్స్లేషన్ మరియు ఫోటో మరియు వీడియో రియల్ టైమ్ లో అందిస్తుంది. ఈ కళ్లజోడు లో ఉన్న 12MP కెమెరాతో ఫోటోలు మరియు వీడియోలు కూడా షూట్ చేయవచ్చు. కేవలం ఇది మాత్రమే కాదు ఇందులో మ్యూజిక్ ని కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఇది ఉపయోగించడం కూడా చాలా సులభం. ఈ కళ్లజోడు Meta AI Mobile App ని మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని ఉపయోగించవచ్చు. ఇది టోటల్ 30 గంటల బ్యాటరీ కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ కళ్లజోడుతో జతగా చేతికి ధరించే ఇన్ రిస్ట్ బ్యాండ్ కూడా వస్తుంది. ఇది ఈ కళ్ళజోడును హాండ్స్ ఫ్రీ గా ఉపయోగించడానికి సహాయం చేస్తుంది. మీరేదైనా టెక్స్ట్ లేదా కమాండ్ ఇవ్వాలనుకుంటే ఈ బ్యాండ్ ధరించి మీ వేళ్ళతో ఎక్కడైనా రాస్తే చాలు ఆ వివరాలు లేదా కమాండ్ ను ఈ స్మార్ట్ కళ్లజోడు రాస్తుంది లేదా ఫాలో అవుతుంది. ఇవన్నీ చూస్తుంటే, ఇది జేమ్స్ బ్యాండ్ సినిమా లో చూసినట్లే అనిపిస్తుంది. మెటా మరియు రేబాన్ కొత్త కళ్లజోడు డైలీ యూసేజ్ కి తగిన విధంగా డిజైన్ చేయబడింది. ఇది WhatsApp, Messenger, Instagram వంటి అప్లికేషన్లకు అనువుగా ఉంటుంది అన్ని నోటిఫికేషన్ ను స్క్రీన్ పై చూపుతుంది.
Also Read: లేటెస్ట్ 180W Dolby Soundbar భారీ డిస్కౌంట్ తో రూ. 4,950 ఆఫర్ రేటుకే లభిస్తోంది.!
Meta Ray-Ban Display: ఇండియాలో లభిస్తుందా?
మెటా రేబాన్ స్మార్ట్ గ్లాస్ ని గ్లోబల్ మార్కెట్ లో అందించింది. ఈ స్మార్ట్ కళ్ళజోడు ఇండియాలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో మెటా ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, 2026 లో మరికొన్ని దేశాల్లో ఈ కొత్త స్మార్ట్ గ్లాసెస్ అందుబాటులోకి వస్తుందని మాత్రం మెటా అనౌన్స్ చేసింది.