Aadhaar on WhatsApp: ఆధార్ కార్డు యూజర్లకు మరింత సులభమైన మరియు ఉన్నతమైన సేవలు అందించడానికి వీలుగా వాట్సాప్ లో కూడా ఆధార్ సేవలు ఆఫర్ చేసింది. UIDAI అందించిన ఈ వాట్సాప్ ఆధార్ సర్వీసుల ద్వారా యూజర్లు జస్ట్ Hi అనే మెసేజ్ తో వాట్సాప్ సర్వీసులను ఆరంభించవచ్చు. ఇందులో ఆధార్ డౌన్లోడ్ మరియు ఆధార్ తో లింక్ అయిన డాక్యుమెంట్స్ వెరిఫై కూడా చేసుకోవచ్చు. వాట్సాప్ లో ఈ సర్వీస్ ను ఎలా ఉపయోగించాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
Aadhaar on WhatsApp: వాట్సాప్ డౌన్లోడ్
ఆధార్ యూజర్ల కోసం UIDAI కొత్తగా MyGov హెల్ప్ డేస్ వాట్సాప్ బాట్ నెంబర్ ను పరిచయం చేసింది. అదే +91 9013151515 మొబైల్ నెంబర్ మరియు ఈ నెంబర్ కి జస్ట్ ‘Hi’ అని మెసేజ్ పెట్టడం ద్వారా ఈ సర్వీస్ ను ఆరంభించవచ్చు. అయితే, మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే, మీ ఆధార్ DigiLocker తో లింక్ అయ్యుండాలి. ఇలా మీ ఆధార్ కార్డ్ డిజిలాకర్ తో లింక్ అయ్యి ఉంటే, మీరు నెక్ట్స్ స్టెప్స్ ఫాలో అవ్వవచ్చు.
ఈ సర్వీస్ కోసం ముందుగా +91 9013151515 మొబైల్ నెంబర్ చాట్ బాక్స్ తెరిచి Hi అని మేసే పెట్టండి. వచ్చిన సర్వీస్ లో DigiLocker సర్వీసెస్ ఎంచుకోండి. ఇక్కడ మీకు డిజిటల్ ఆధార్ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ ను ఎంచుకోగానే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి OTP అందుతుంది. ఈ OTP ఎంటర్ చేయగానే మీ ఆధార్ కార్డు PDF ఫైల్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. అయితే, ఎప్పుడైనా ఎక్కడైనా ఆధార్ డౌన్లోడ్ లేదా సర్వీస్ ఉపయోగించే సమయంలో కొన్ని ముఖ్యమైన సెక్యూరిటీ టిప్స్ గుర్తుంచుకోండి.
ఆధార్ సర్వీసుల కోసం ఎల్లప్పుడూ UIDAI, DigiLocker మరియు MyGov వంటి ప్రభుత్వ ఛానల్ మాత్రమే ఎంచుకోండి. మీ రిజిస్టర్ నెంబర్ పై అందుకునే ఆధార్ OTP ని ఎవరితో షేర్ చేయకండి. మీరు గవర్నమెంట్ ప్రకటించిన అఫీషియల్ నెంబర్ పై మాత్రమే చాటింగ్ చేయండి.
Aadhaar on WhatsApp: ఏ సర్వీస్ లు అందుబాటులో ఉండవు?
మీరు వాట్సాప్ లో ఆధార్ సర్వీసులను మీరు ఉపయోగించలేరు అని చూస్తే, ఇందులో మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయలేరు. అలాగే, బయోమెట్రిక్ అప్డేట్, అడ్రస్ చేంజ్, నేమ్ చేంజ్ మరియు పుట్టిన తేదీ వివరాలు వాట్సప్ సర్వీస్ ద్వారా నిర్వహించలేరు.