Samsung Galaxy S25 FE సుపీరియర్ కెమెరా మరియు ఫ్లాగ్ షిప్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
ఈరోజు శామ్సంగ్ ప్రీమియం S సిరీస్ నుంచి బడ్జెట్ ఫోన్ ను ప్రకటించింది
Samsung Galaxy S25 FE స్మార్ట్ ఫోన్ ను ఫ్లాగ్ షిప్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది
ఈ ఫోన్ 30FPS తో UHD 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది
Samsung Galaxy S25 FE స్మార్ట్ ఫోన్ ను ఈరోజు శామ్సంగ్ ప్రీమియం S సిరీస్ నుంచి బడ్జెట్ ఫోన్ ను ప్రకటించింది. రీసెంట్ గా శామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ S25 5జి, S25 ప్లస్ మరియు S25 అల్ట్రా ఫోన్లు లాంచ్ చేసింది. ఈ సిరీస్ బేసిక్ ఫోన్ అయిన గెలాక్సీ S25 FE స్మార్ట్ ఫోన్ ను ఈరోజు విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను సుపీరియర్ కెమెరా మరియు ఫ్లాగ్ షిప్ ఫీచర్స్ తో లాంచ్ చేసింది.
SurveySamsung Galaxy S25 FE : ఫీచర్స్
శామ్సంగ్ గెలాక్సీ S25 FE స్మార్ట్ ఫోన్ ను Exynos 2400 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఇది గరిష్టంగా 3.2GHz క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది మరియు మరింత AI సపోర్ట్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్ మరియు 512 జీబీ హెవీ స్టోరేజ్ కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.55 ఇంచ్ Dynamic AMOLED 2X స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ FHD+ (1080 x 2340), 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు అధిక బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 7.66 మందంతో స్లీక్ గా మరియు 190 గ్రాముల బరువుతో లైట్ గా కూడా ఉంటుంది.

కెమెరా పరంగా, శామ్సంగ్ గెలాక్సీ S25 FE స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 50MP మెయిన్, 12MP అల్ట్రా వైడ్ మరియు 8MP (3x ఆప్టికల్ జూమ్) టెలిఫోటో కెమెరాలు ఉంటాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా కూడా అందించింది. ఈ ఫోన్ 30FPS తో UHD 8K (7680 x 4320) వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు 120fps తో 4K UHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ AI కెమెరా సపోర్ట్ తో వస్తుంది మరియు గొప్ప ఫోటోలు అందిస్తుంది.
ఇక ఈ ఫోన్ కలిగిన మరిన్ని ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను 4900 బ్యాటరీతో శామ్సంగ్ లాంచ్ చేసింది మరియు ఇది ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 30 సెప్టెంబర్ 2032 వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది. ఈ శామ్సంగ్ కొత్త ఫోన్ IP68 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ ను గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ గ్లాస్ రక్షణ అందించింది.
Also Read: ప్రపంచంలో అత్యంత స్లీక్ ఫోన్ గా Tecno Pova Slim 5G ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
Samsung Galaxy S25 FE : ప్రైస్
శామ్సంగ్ గెలాక్సీ S25 FE స్మార్ట్ ఫోన్ ఇండియా ప్రైస్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ప్రైస్ వివరాలు అందించిన వెంటనే మీకు మీకు అప్డేట్ అందిస్తాము.