Lava Bold N1 5G: స్టన్నింగ్ డిజైన్ తో కొత్త లాంచ్ ప్రకటించిన లావా.!
లావా ఇండియాలో కొత్త 5జి స్మార్ట్ ఫోన్ కోసం టీజింగ్ మొదలుపెట్టింది
లావా యొక్క బడ్జెట్ సిరీస్ గా పేరొందిన బోల్డ్ ఎన్ 1 సిరీస్ నుంచి ఈ ఫోన్ లాంచ్ చేస్తోంది
Lava Bold N1 5G లాంచ్ గురించి కంపెనీ అఫీషియల్ X అకౌంట్ నుంచి ట్వీట్ చేసింది
Lava Bold N1 5G: లావా ఇండియాలో కొత్త 5జి స్మార్ట్ ఫోన్ కోసం టీజింగ్ మొదలుపెట్టింది. లావా యొక్క బడ్జెట్ సిరీస్ గా పేరొందిన బోల్డ్ ఎన్ 1 సిరీస్ నుంచి ఈ ఫోన్ లాంచ్ చేస్తోంది. ఎప్పటిలాగానే ఈ ఫోన్ ను కూడా అమెజాన్ ద్వారా టీజింగ్ చేస్తోంది మరియు ఈ ఫోన్ లాంచ్ గురించి కంపెనీ అఫీషియల్ X అకౌంట్ నుంచి ట్వీట్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ విశేషాలు ఏమిటో చూద్దామా.
SurveyLava Bold N1 5G ఎప్పుడు లాంచ్ అవుతుంది?
లావా బోల్డ్ ఎన్ 1 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ ఫోన్ కోసం ప్రస్తుతానికి కేవలం ‘కమింగ్ సూన్’ టైటిల్ తో టీజింగ్ మాత్రమే మొదలుపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం అందించిన ట్వీట్ లో ఈ ఫోన్ డిజైన్ తెలియచేసే టీజర్ ఇమేజ్ అందించింది. అలాగే, ఈ ఫోన్ కోసం సేల్ పార్ట్నర్ అయిన అమెజాన్ కూడా ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది.
Lava Bold N1 5G ఫీచర్స్ ఏమిటి?
లావా బోల్డ్ ఎన్ 1 5జి ఫీచర్స్ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ టీజర్ పేజీ ద్వారా ఈ ఫోన్ డిజైన్ మరియు కొన్ని వివరాలు అంచనా వేయడానికి అవకాశం అందించింది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ రౌండ్ కార్నర్ కలిగిన స్లీక్ డిజైన్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ కూడా ఈ సిరీస్ లో ముందు వచ్చిన బోల్డ్ N1 మరియు బోల్డ్ N1 ప్రో లాంటి డిజైన్ తో ఉంటుంది.

లావా బోల్డ్ ఎన్ 1 5జి లో వెనుక పెద్ద కెమెరా స్క్వేర్ బంప్ ఉన్నట్లు టీజర్ ఇమేజ్ లో కనిపిస్తోంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు కూడా కనబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్ వేరియంట్ తో చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో 50MP AI ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు కూడా అర్ధం అవుతుంది.
Also Read: Apple Hebbal: సౌత్ ఇండియాలో మొదటి ఆపిల్ స్టోర్ ఓపెన్ చేసిన యాపిల్.!
ఈ ఫోన్ ను ‘బీ ఫియర్ లెస్’ అనే ట్యాగ్ లైన్ తో లావా టీజింగ్ చేస్తోంది. అంటే, దేనికి భయపడకు అని అర్థం వచ్చేలా చెబుతోంది. అంటే, పెర్ఫార్మన్స్, బ్యాటరీ, స్క్రీన్ మరియు కెమెరా వంటి అన్ని విషయాల్లో ఈ ఫోన్ తగిన విధంగా ఉండేలా ఉంటుందనే అర్థం వచ్చేలా టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు కీలక ఫీచర్లు కూడా త్వరలోనే లాంచ్ చేస్తుంది కాబట్టి ఈ ఫోన్ ఎలా ఉంటుందో తెలిసే అవకాశం ఉంటుంది.