Apple Hebbal: సౌత్ ఇండియాలో మొదటి స్టోర్ ఓపెన్ చేసిన యాపిల్.!
ముందుగా ఢిల్లీ మరియు ముంబాయి మహానగరాల్లో స్టోర్ ఓపెన్ చేసిన యాపిల్
ఇప్పుడు సౌత్ ఇండియాలో తన మొదటి స్టోర్ తెరిచింది
ఈ ఆపిల్ స్టోర్ కి ’యాపిల్ హెబ్బాల్ స్టోర్’ పేరు పెట్టింది
Apple Hebbal: ముందుగా ఢిల్లీ మరియు ముంబాయి మహానగరాల్లో స్టోర్ ఓపెన్ చేసిన యాపిల్, ఇప్పుడు సౌత్ ఇండియాలో తన మొదటి స్టోర్ తెరిచింది. అదే యాపిల్ సరికొత్తగా ఓపెన్ చేసిన యాపిల్ హెబ్బాల్ స్టోర్ మరియు ఈ స్టోర్ ను ఈరోజు ఓపెన్ చేసింది. ఈ స్టోర్ ను బెంగళూరు నగరం లోని హెబ్బాల్ ప్రాంతంలో లాంచ్ చేసింది. అందుకే, ఈ ఆపిల్ స్టోర్ కి ’యాపిల్ హెబ్బాల్ స్టోర్’ పేరు పెట్టింది.
SurveyApple Hebbal:
పైన తెలిపిన విధంగా ఈ స్టోర్ ను బెంగళూరు నగరంలోని హెబ్బాల్ ప్రాంతంలో లాంచ్ చేసింది అందుకే ఈ స్టోర్ కి యాపిల్ హెబ్బాల్ స్టోర్ అని నామకరణం చేసింది. ఈ స్టోర్ నుంచి యాపిల్ లాంచ్ చేసిన కొత్త iPhone, iPad, MacBook మరియు Apple Watch వంటి యాపిల్ ప్రొడక్ట్స్ ని ప్రత్యక్షంగా చూసి, ఉపయోగించి మరియు వాటి ఫీల్ పొంది కొనుగోలు చేయవచ్చు.
ఎందుకు Apple Hebbal?
యాపిల్ హెబ్బల్ స్టోర్ ఉత్తర బెంగళూరు యూజర్లకు దగ్గరగా ఉంటుంది. ఈ స్టోర్ నుంచి యాపిల్ యొక్క ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్ మరియు మాక్ బుక్ వంటి ప్రొడక్ట్స్ యొక్క డెమో మరియు యాపిల్ యొక్క ఇంజినీర్స్ ద్వారా యూజర్ గైడెన్స్ కూడా లభిస్తుంది. ఈ స్టోర్ నుంచి యూజర్లకు టెక్ సపోర్ట్, నిపుణుల సలహాలు, సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్ రిపేర్ సేవలు కూడా అందిస్తుంది. ముఖ్యంగా, ఫోన్ సర్వీస్ కోసం సంవత్సరాల కొద్దీ ఉన్న సమస్యను తొలగించింది.

అంతేకాదు, బ్యాంక్ ఆఫర్స్ మరియు డీల్స్ కూడా ఈ స్టోర్ నుంచి యూజర్లు నేరుగా అందుకోవచ్చు. కొత్త సిరీస్ ఐఫోన్ కోసం రోజుల షాపుల వద్ద రోజుల తరబడి తిరిగే అవసరం లేకుండా నేరుగా స్టోర్ నుంచి బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ కొత్త స్టోర్ అడ్రస్ విషయానికి వస్తే, బెంగళూరు ఉత్తర ప్రాంతంలో ఉన్న ‘ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఏషియా’ షాపింగ్ మాల్ లో ఈ స్టోర్ ను ఓపెన్ చేసింది.
Also Read: Realme 15T: బడ్జెట్ ధరలో 7000mAh బ్యాటరీ మరియు స్టన్నింగ్ కెమెరాలతో లాంచ్ అయ్యింది.!
Apple Store ఇండియాలో ఎక్కడ ఉన్నాయి?
యాపిల్ ఇండియాలో ప్రస్తుతానికి 4 ప్రాంతాల్లో తన యాపిల్ స్టోర్లు ఓపెన్ చేసింది. ముందుగా ఢిల్లీ లోని సాకేత్ మరియు మహారాష్ట్ర రాష్ట్రం లోని ముంబాయి సిటీలో ఉన్న బాంద్రా కుర్ల కాంప్లెక్స్ లో (Apple BKC) లో యాపిల్ స్టోర్స్ ప్రారంభించింది. ఇప్పుడు కొత్తగా రెండు స్టోర్స్ లాంచ్ చేసింది. ఇందులో ఒకటి కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరం లోని హెబ్బాల్ ప్రాంతంలో యాపిల్ హెబ్బల్ స్టోర్ కాగా, రెండోది మహారాష్ట్ర రాష్ట్రం పూణే సిటీలో కోరేగావ్ పార్క్ ప్రాంతంలో యాపిల్ కోరేగావ్ పార్క్ పేరుతో ఓపెన్ చేసింది. అంటే, యాపిల్ ప్రస్తుతానికి 4 స్టోర్లు ఇండియాలో ఓపెన్ చేసింది.