Jio Best Plans: బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ లను జియో నిలిపి వేస్తున్నట్లు కొని కధనాలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. అయితే, ఏ ప్లాన్స్ ఉన్న లేకున్నా తక్కువ ఖర్చుతో OTT తో సహా అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ కొన్ని ఉన్నాయి. అటువంటి బెస్ట్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి ఈరోజు వివరంగా చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా Jio Best Plans ?
రిలయన్స్ జియో యూజర్ల కోసం అనేక ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించింది. వాటిలో అన్లిమిటెడ్ 5జి తో వచ్చే బెస్ట్ ప్లాన్స్ చాలానే ఉన్నాయి. ఇందులో ఒక రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ తక్కువ ఖర్చుతో ఓటీటీ ప్లాట్ ఫామ్ తో సహా అన్లిమిటెడ్ కాలింగ్ వంటి పూర్తి ప్రయోజనాలు అందిస్తాయి. వీటిలో, జియో రూ. 899 మరియు రూ. 999 ప్రధానమైన ప్రీపెయిడ్ ప్లాన్స్ గా నిలుస్తాయి. ఈ రెండు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే కంప్లీట్ బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాం.
రిలయన్స్ జియో రూ. 899 రూపాయల అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ఓట్ రీఛార్జ్ చేసే యూజర్లకు 90 రోజులు చెల్లుబాటు లభిస్తుంది. ఈ 90 రోజులు చెల్లుబాటు కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ప్లాన్ తో డైలీ 2 జీబీ డైలీ డేటా మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. ఇది కాకుండా జియో 5జి నెట్వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా కూడా అందిస్తుంది.
ఇంతవరకు అందించిన ప్రయోజనాలు ఒకెత్తయితే ఈ ప్లాన్ తో 90 రోజుల జియో హాట్ స్టార్ OTT సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందించడం మరో ఎత్తవుతుంది. ఇంతటితో ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలు ముగియలేదు. ఈ ప్లాన్ తో Jio AI cloud మరియు Jio Tv యాప్స్ కి కూడా యాక్సెస్ అందిస్తుంది.
జియో ఆఫర్ చేస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లలో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 98 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 98 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ చొప్పున 98 రోజులపాటు అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే జియో ట్రూ 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 90 రోజుల జియో హాట్ స్టార్ ఉచిత సబ్ స్క్రిప్షన్, Jio AI cloud మరియు Jio Tv యాప్స్ కి కూడా యాక్సెస్ అందిస్తుంది.