Lava Play Ultra 5G: లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ ప్రకటించిన లావా.!
Lava Play Ultra 5G ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు కూడా లావా అనౌన్స్ చేసింది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం చాలా రోజులుగా టీజింగ్ చేస్తున్న లావా
గేమింగ్ కోసం ఈ ఫోన్ ను ప్రత్యేకంగా తీసుకొస్తున్నట్లు లావా తెలిపింది
Lava Play Ultra 5G: లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లావా ప్లే అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు కూడా ఈరోజు లావా అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం చాలా రోజులుగా టీజింగ్ చేస్తున్న లావా, ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. గేమింగ్ కోసం ఈ ఫోన్ ను ప్రత్యేకంగా తీసుకొస్తున్నట్లు లావా తెలిపింది.
SurveyLava Play Ultra 5G ఎప్పుడు లాంచ్ అవుతుంది?
లావా ప్లే అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ రేపు సాయంత్రం అనగా, ఆగస్టు 20వ తేదీ రాత్రి 8 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కార్యక్రమాన్ని లావా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ‘@lavamobiles’ ద్వారా చూడవచ్చు. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది.
Lava Play Ultra 5G కీలక ఫీచర్స్ ఏమిటి?
లావా ప్లే అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ రౌండ్ కార్నర్ కలిగిన స్లీక్ డిజైన్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ 7300 5జి చిప్ సెట్ తో అవుతుంది. ఈ విషయాన్ని లావా కన్ఫర్మ్ చేసింది మరియు ఈ చిప్ సెట్ తో ఈ ఫోన్ మంచి గేమింగ్ ఎక్స్ పీరియన్స్ అందించే సత్తా కలిగి ఉంటుందని లావా చెబుతోంది. ఈ చిప్ సెట్ 7,00,000 కంటే అధిక AnTuTu స్క్రీన్ అందిస్తుంది. ఈ ఫోన్ లో టైప్ C ఛార్జింగ్ పోర్ట్ మరియు అడుగున పెద్ద స్పీకర్ గ్రిల్ ఉన్నట్లు కూడా టీజర్ ఇమేజ్ ద్వారా అర్థం అవుతుంది.

ఈ ఫోన్ కలిగిన స్క్రీన్ వివరాలు కూడా లావా ముందే బయటపెట్టింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను సన్నని అంచులు కలిగిన AMOLED స్క్రీన్ కలిగి ఉంటుందని లావా అప్డేట్ విడుదల చేసింది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు అధిక బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా సిస్టం గురించి కూడా లావా వివరాలు అందించింది.
Also Read: Redmi 15 5G: కంటెంట్ అండ్ గేమింగ్ కు తగిన బిగ్ డిస్ప్లే మరియు 7000 mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది.!
ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ వీడియోలో ఈ ఫోన్ వివరాలు అందించింది. ఈ ఫోన్ లో 64MP AI మ్యాట్రిక్స్ కెమెరా ఉన్నట్లు తెలిపింది. ఈ ఫోన్ కూడా లావా యొక్క ఫ్రీ హోమ్ సర్వీస్ ను ఈ ఫోన్ తో కూడా అందించే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ రేపు రాత్రి మార్కెట్ లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత ప్రైస్ మరియు కంప్లీట్ ఫీచర్స్ తో మళ్ళీ కలుద్దాం.