Sony ULT Power Sound సిరీస్ నుంచి కొత్త స్పీకర్లు లాంచ్: ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

HIGHLIGHTS

సోనీ కొత్తగా ULT టవర్ 9 మరియు టవర్ 9AC స్పీకర్లు టవర్ సిరీస్ నుంచి అందించింది

ULT ఫీల్డ్ 5 మరియు ఫీల్డ్ 3 రెండు బ్లూటూత్ స్పీకర్లు ఫీల్డ్ సిరీస్ నుంచి అందించింది

ULT మైక్ 1 మైక్రోఫోన్ ను కూడా కొత్తగా అందించింది

Sony ULT Power Sound సిరీస్ నుంచి కొత్త స్పీకర్లు లాంచ్: ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

Sony ULT Power Sound సిరీస్ నుంచి 5 కొత్త ప్రొడక్ట్స్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కోర్ మ్యూజిక్ ప్రియుల కోసం సోనీ ప్రత్యేకంగా అందించిన ఈ ప్రత్యేకమైన సౌండ్ ప్రొడక్ట్స్ అన్ని విషయాలలో ఆకట్టుకుంటాయి. ఇప్పుడు ఈ పవర్ సౌండ్ సిరీస్ లో రెండు టవర్ స్పీకర్లు, రెండు బ్లూటూత్ స్పీకర్లు మరియు డ్యూయల్ వైర్లెస్ మైక్రోఫోన్ లను అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Sony ULT Power Sound : కొత్త ప్రొడక్ట్స్ ఏమిటి?

సోనీ కొత్తగా ULT టవర్ 9 మరియు టవర్ 9AC స్పీకర్లు టవర్ సిరీస్ నుంచి అందించింది. అలాగే, ULT ఫీల్డ్ 5 మరియు ఫీల్డ్ 3 రెండు బ్లూటూత్ స్పీకర్లు ఫీల్డ్ సిరీస్ నుంచి అందించింది. అలాగే, ULT మైక్ 1 మైక్రోఫోన్ ను కూడా కొత్తగా అందించింది.

ULT టవర్ 9 మరియు టవర్ 9AC : ధర మరియు ఫీచర్లు

ఈ టవర్ స్పీకర్లు మాత్రం ప్రీమియం ఫీచర్స్ మరియు ప్రీమియం ప్రైస్ తో మార్కెట్ లో అడుగుపెట్టాయి. వీటిలో ULT టవర్ 9 స్పీకర్ రూ. 84,990 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో మరియు టవర్ 9AC స్పీకర్ రూ. 69,990 ధరతో లాంచ్ అయ్యాయి. ఈ రెండు స్పీకర్లు కూడా పేరుకు తగ్గట్టుగానే పవర్ సౌండ్ అందిస్తాయి. ఇవి పవర్ ఫుల్ ఉఫర్, ట్వీటర్లు మరియు మిడ్ రేంజ్ స్పీకర్లను కలిగి సౌండ్ అందించే శక్తి కలిగి ఉంటాయి.

Sony ULT Power Sound

ఈ రెండు స్పీకర్లు కూడా 10 బ్యాండ్ ఈక్వలైజర్ మరియు LDAC సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్పీకర్లు సోనీ పార్టీ యాప్ “Sound Connect” సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ స్పీకర్లు 360 డిగ్రీల సౌండ్ మరియు పార్టీ కోసం తగిన పవర్ జబర్దస్త్ సౌండ్ అందిస్తాయి.

Also Read: Sony Dolby Atmos సౌండ్ బార్ పై అమెజాన్ బిగ్ డీల్స్ అందుకోండి.!

ULT ఫీల్డ్ 5 మరియు ఫీల్డ్ 3 : ధర మరియు ఫీచర్లు

ఈ సోనీ ULT ఫీల్డ్ 5 బ్లూటూత్ స్పీకర్ ను రూ. 24,990 రూపాయల ధరతో మరియు ULT ఫీల్డ్ 3 బ్లూటూత్ స్పీకర్ ను రూ. 17,990 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఈ రెండు స్పీకర్లు కూడా స్టీరియో పెయిర్ మరియు పార్టీ కనెక్ట్ ఫంక్షన్ సపోర్ట్ కలిగి ఉంటాయి. ఈ స్పీకర్లు కూడా Sound Connect సపోర్ట్ కలిగి ఉంటాయి. ఈ స్పీకర్లలో ఉఫర్ మరియు ట్వీటర్ స్పీకర్లు కలిగి ఉంటాయి. ఈ రెండు స్పీకర్లు కూడా పార్టీ యాంబియన్స్ కోసం LED లైట్ సెటప్ కలిగి ఉంటాయి. ఈ స్పీకర్లు సోనీ అఫీషియల్ సైట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo