Oppo K13 Turbo Pro: మొబైల్ మార్కెట్ ఎన్నడూ చూడని కొత్త ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

Oppo K13 Turbo Pro స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది

ఈ ఫోన్ మొబైల్ మార్కెట్ ఎన్నడూ చూడని కొత్త ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది

ఒప్పో ఈ ఫోన్ ను మొబైల్ చరిత్రలో ఎన్నడూ చూడని కొత్త కూలింగ్ ఫ్యాన్ టెక్నాలజీ తో అందించింది

Oppo K13 Turbo Pro: మొబైల్ మార్కెట్ ఎన్నడూ చూడని కొత్త ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

Oppo K13 Turbo Pro స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ ను ముందుగా చైనా లో విడుదల చేసిన ఒప్పో, ఇప్పుడు ఇండియాలో కూడా విడుదల చేసింది. ఈ ఫోన్ మొబైల్ మార్కెట్ ఎన్నడూ చూడని కొత్త ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఒప్పో ఇండియాలో ఈరోజే సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Oppo K13 Turbo Pro: ఫీచర్స్

ఒప్పో ఈ ఫోన్ ను మొబైల్ చరిత్రలో ఎన్నడూ చూడని కొత్త కూలింగ్ ఫ్యాన్ టెక్నాలజీ తో అందించింది. ఈ ఫోన్ ను చాలా వేగంగా చల్లబరచడానికి ఈ కొత్త ఫీచర్ ను అందించింది. అంటే, ఈ ఫోన్ లో చిన్న మైక్రో ఫ్యాన్ ని అందించింది. ఫోన్ వేడెక్కినప్పుడు ఈ ఫోన్ లో ఉన్న ఈ కూలింగ్ ఫ్యాన్ ఈ ఫోన్ ను చల్లబరుస్తుంది. ఈ టెక్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ల్యాప్ టాప్ లో ఉండే ఫ్యాన్ మాదిరిగా ఉంటుంది. ఈ ఫీచర్ తో వచ్చిన మొదటి ఫోన్ ఇదే అవుతుంది. అంతేకాదు, ఒప్పో ఫోన్లలో ఎన్నడూ చూడని కొత్త డిజైన్ కూడా ఈ ఫోన్ లో అందించింది.

Oppo K13 Turbo Pro Features

ఈ ఫోన్ లో 6.8 ఇంచ్ బిగ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రెట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1.5K రిజల్యూషన్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 8s Gen 4 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ వేగవంతమైన ప్రోసెసర్ తో జతగా 12GB LPDDR5X ఫాస్ట్ ర్యామ్ మరియు బిగ్ 256GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ 50 మెయిన్ 2MP బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 16MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 60fps మరియు 30fps తో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు ఇతర కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 7000 mAh బిగ్ బ్యాటరీ అందించింది. అంతేకాదు, ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 80W సూపర్ ఫ్లాష్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో బైపాస్ ఛార్జ్ ఫీచర్ కూడా అందించింది.

ఈ ఫోన్ మరింత కూలింగ్ కోసం అల్ట్రా లార్జ్ 7000 mm స్క్వేర్ వేపర్ ఛాంబర్ కూలింగ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ఫ్యాన్ ఉన్నా కూడా ఈ ఫోన్ IPX6, IPX8 మరియు IPX9 రేటింగ్ తో టాప్ టైర్ వాటర్ ప్రూఫ్ ఫోన్ గా వచ్చింది. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు X axis లైనర్ మోటార్ కూడా ఉన్నాయి.

Also Read: Tecno Spark Go 5G బిగ్ బ్యాటరీ మరియు వేగవంతమైన 5G ఫీచర్ తో లాంచ్ అవుతోంది.!

Oppo K13 Turbo Pro ధర ఏమిటి?

ఒప్పో కె13 టర్బో ప్రో స్మార్ట్ ఫోన్ ను 2 వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ 2 వేరియంట్స్ ఈ క్రింద చూడవచ్చు.

ఒప్పో కె13 టర్బో ప్రో (8 జీబీ + 256 జీబీ) ధర : రూ. 37,999

ఒప్పో కె13 టర్బో ప్రో (12 జీబీ + 256 జీబీ) ధర : రూ. 39,999

ఈ ఫోన్ ఆగస్టు 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు ఒప్పో అఫీషియల్ సైట్ నుంచి సేల్ అవుతుంది.

Oppo K13 Turbo Pro Price

ఆఫర్లు

ఒప్పో ఈ ఫోన్ పై భారీ లాంచ్ ఆఫర్లు కూడా అందించింది. ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ను సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 34,999 రూపాయల ప్రారంభ ధరలో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo