Instagram యూజర్లకు చేదు వార్త.. ఇక నుంచి వారికి Live స్ట్రీమ్ అవకాశం ఉండదు.!
Instagram కొత్త అప్డేట్ విడుదల చేసింది
ఈ కొత్త అప్డేట్ తో ఒక కొత్త రూల్ కూడా పెట్టింది
ఆ యూజర్లకు ఇక నుంచి ఇంస్టాగ్రామ్ లో లైవ్ వీడియో చేసే అవకాశం ఉండదు
Instagram కొత్త అప్డేట్ విడుదల చేసింది మరియు ఈ కొత్త అప్డేట్ చాలా మంది యూజర్లకు చేదు వార్త అవుతుంది. అదేమిటీ కొత్త అప్‌డేట్ వస్తే చేదు వార్త అంటారా? అనుకోకండి. దీనికి తగిన కారణం వుంది. ఈ కొత్త అప్డేట్ తో ఒక కొత్త రూల్ కూడా పెట్టింది. అదే, Instagram Live ఫీచర్ రూల్. ఇప్పటివరకు ఎటువంటి లిమిట్ లేని ఇంస్టాగ్రామ్ లైవ్ స్ట్రీమ్ ఫీచర్ లో ఇప్పుడు కొత్తగా లిమిట్ అందించింది. అంటే, చాలా మంది యూజర్లకు ఇక నుంచి ఇంస్టాగ్రామ్ లో లైవ్ వీడియో చేసే అవకాశం ఉండదు.
SurveyInstagram Live : ఏమిటా చేదు వార్త?
ఇంస్టాగ్రామ్ లైవ్ స్ట్రీమ్ ఫీచర్ ఎక్కువగా ఉపయోగించే గొప్ప ఫీచర్ గా చెప్పబడుతుంది. యువత మొదలు కొని పెద్ద వారి వరకు వారికి నచ్చిన లేదా తోచిన విషయాన్ని వెల్లడిస్తూ లైవ్ స్ట్రీమ్ చేయడం పరిపాటిగా మారింది. అయితే, ఇక నుంచి ఇందులో పెద్ద మార్పు తెచ్చింది. అదేమిటంటే, ఇంస్టాగ్రామ్ లైవ్ స్ట్రీమ్ చేయాలంటే కనీసం 1000 మంది సబ్ స్క్రైబర్స్ ఉండాలని ఇంస్టాగ్రామ్ రూల్ పెట్టింది.

ఈ కొత్త రూల్ ఇప్పటికే కొత్త అప్డేట్ ద్వారా అమల్లోకి కూడా తీసుకు వచ్చింది. అంటే, మీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో 1000 సబ్ స్క్రైబర్స్ లేకుంటే మీరు ఒక నుంచి లైవ్ స్ట్రీమ్ చేయలేరు, అని ఇంస్టాగ్రామ్ తేల్చి చెప్పింది. కేవలం ఇది మాత్రమే కాదు మీ అకౌంట్ Public (పబ్లిక్) అకౌంట్ గా నమోదు చేసి ఉండాలి. పబ్లిక్ అకౌంట్ కాకుంటే కూడా మీరు లైవ్ స్ట్రీమ్ చేసే అవకాశం కోల్పోతారు. ఎందుకంటే, ప్రైవేట్ అకౌంట్ కు లైవ్ స్ట్రీమ్ అనుమతి నిలిపివేసినట్లు ఇంస్టాగ్రామ్ అనౌన్స్ చేసింది.
ఇంస్టాగ్రామ్ యల్ చేయడానికి కారణం ఏమిటి?
ఫేక్ లైవ్ మరియు అభ్యంతరకర కంటెంట్ ను తగ్గించడానికి మరియు నిర్ములించడానికి ఇంస్టాగ్రామ్ ఈ కొత్త చర్యలు తీసుకున్నట్లు చెబుతోంది. అంతేకాదు, దీని ద్వారా సర్వర్ లోడ్ మరియు తప్పుడు ప్రచారం లేదా సమాచారం కూడా తగ్గించే అవకాశం ఉంటుంది.
Also Read: Vivo V60 టాప్ 5 ఫీచర్స్ మరియు అంచనా ప్రైస్ తెలుసుకోండి.!
ఎవరి పై ఎక్కువ ప్రభావం చూపుతుంది?
ఈ కొత్త యాక్షన్ ద్వారా కొత్త అకౌంట్ లేదా ఛానల్ ఓపెన్ చేసిన వారిపై ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే, కొత్త అకౌంట్ యూజర్లు లైవ్ స్ట్రీమ్ చేయడానికి ముందుగా 1000 సబ్ స్క్రైబర్స్ ని సంపాదించుకోవాలి. అయితే, మరో కేటగిరి యూజర్లు కూడా ఉన్నారు. అదేనండి తప్పుడు, ఫేక్ మరియు అసభ్యకర కంటెంట్ మరియు లైవ్ స్ట్రీమ్ చేసే యూజర్లు. వీళ్లకు ఇక నుంచి లైవ్ ను ప్రైవేట్ చేసుకునే అవకాశం ఉండదు.