Samsung Galaxy F36 5G: AI కెమెరా ఫోన్ లాంచ్ చేస్తున్న శామ్సంగ్.!
గెలాక్సీ F సిరీస్ నుంచి ఈ Hi-FAI ఫోన్ ను లాంచ్ చేస్తునట్లు అనౌన్స్ చేసింది
లెథర్ బ్యాక్ మరియు మరిన్ని ప్రీమియం ఫీచర్స్ తో అందిస్తున్నట్లు శామ్సంగ్ తెలిపింది
Samsung Galaxy F36 5G రేపు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది
Samsung Galaxy F36 5G: శామ్సంగ్ ఇండియన్ మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. గెలాక్సీ F సిరీస్ నుంచి ఈ Hi-FAI ఫోన్ ను లాంచ్ చేస్తునట్లు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ప్రీమియం లెథర్ బ్యాక్ మరియు మరిన్ని ప్రీమియం ఫీచర్స్ తో అందిస్తున్నట్లు శామ్సంగ్ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ ఫోన్ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
SurveySamsung Galaxy F36 5G : లాంచ్
శామ్సంగ్ ఈ స్మార్ట్ ఫోన్ ను రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ తో టీజింగ్ చేస్తుంది. ఈ మైక్రో సైట్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. అంటే, ఈ ఫోన్ లాంచ్ తర్వాత కంపెనీ అఫీషియల్ సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ అవుతుంది.
Samsung Galaxy F36 5G : కీలక ఫీచర్స్
శామ్సంగ్ గెలాక్సీ F36 5జి స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం డిజైన్ తో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ లో వెనుక ప్రీమియం లెథర్ డిజైన్ ను అందించింది మరియు ఈ ఫోన్ చూడటానికి చాలా స్లీక్ గ మరియు రౌండ్ కార్నర్స్ తో చాలా అందంగా కనిపించేలా అందించింది. ఈ ఫోన్ ను లేటెస్ట్ AI ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు శామ్ సంగ్ చెబుతోంది. ఇందులో AI ఎరేజర్ ఫీచర్ ను టీజర్ పేజి ద్వారా వెల్లడించింది. దీని ప్రకారం, ఈ ఫోన్ లో మరిన్ని AI కెమెరా ఫీచర్స్ ఉన్నట్లు కూడా హింట్ ఇచ్చింది.

ఈ శామ్సంగ్ గెలాక్సీ అప్ కమింగ్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు క్లియర్ చేసింది. ఇందులో, 50MP మెయిన్, 8MP అల్ట్రా మరియు 2MP మాక్రో కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరాతో అందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ శామ్సంగ్ లేటెస్ట్ Exynos 1380 చిప్ సెట్ తో లాంచ్ చేయవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.
Also Read: GOAT Sale చివరి రోజు POCO F7 5G పై బిగ్ డీల్ అందుకోండి.!
ఈ ఫోన్ లో 6.7 ఇంచ్ సూపర్ AMOLED స్క్రీన్ ను గొరిల్లా గ్లాస్ వికాస్ ప్లస్ రక్షణతో శామ్సంగ్ లాంచ్ చేసే అవకాశం ఉండవచ్చని కూడా రూమర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ రేఫు లాంచ్ అవుతుంది కాబట్టి ప్రస్తుతం వేస్తున్న అంచనాలు మరియు రూమర్స్ లో ఎన్ని నిజం అవుతాయో రేపు తెలుస్తుంది.