Curved AMOLED ప్యానల్ తో వచ్చిన రియల్ మీ కొత్త స్మార్ట్ వాచ్.!

HIGHLIGHTS

రియల్ మీ ఇండియాలో అనేక కొత్త ప్రోడక్ట్ లను విడుదల చేసింది

లేటెస్ట్ స్మార్ట్ వాచ్ Realme Watch 3 Pro ని కూడా లాంచ్ చేసింది

రియల్ మీ వాచ్ 3 ప్రో పెద్ద Curved AMOLED HD ప్యానల్ తో వచ్చింది

రియల్ మీ ఇండియాలో అనేక కొత్త ప్రోడక్ట్ లను విడుదల చేసింది. నిన్న జరిగిన ఈవెంట్ నుండి కంపెనీ తన లేటెస్ట్ స్మార్ట్ వాచ్ Realme Watch 3 Pro ని కూడా లాంచ్ చేసింది. రియల్ మీ వాచ్ 3 ప్రో పెద్ద Curved AMOLED HD ప్యానల్ తో వచ్చింది. రియల్ మీ యొక్క ఈ లేటెస్ట్ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్ మరియు మాగ్నెటిక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇండియాన్ మార్కెట్లో సరికొత్తగా వచ్చిన ఈ రియల్ మీ స్మార్ట్ వాచ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఏమిటో తెలుసుకుందామా.

Realme Watch 3 Pro: ధర

realme Watch 3 Pro నలుపు మరియు గ్రే రెండు కలర్ అప్షన్లలో లభిస్తుంది మరిన్ని దీని ధర రూ.4,999. ఈ స్మార్ట్ వాచ్ Flipkart మరియు కంపెనీ ధికారిక వెబ్సైట్ నుండి సెప్టెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి సేల్ అవుతుంది.

Realme Watch 3 Pro: ప్రత్యేకతలు

రియల్ మీ వాచ్ 3 ప్రో స్మార్ట్ వాచ్ 1.78 ఇంచ్ Curved AMOLED HD ప్యానల్ తో వస్తుంది. ఇది సన్నని అంచుతో వచ్చింది మరియు మరింత వ్యూ ను అందిస్తుంది. వాచ్ 3 ప్రో, అధిక పనితీరు గల బ్లూటూత్ కాలింగ్ సామర్థ్యంతో పాటు అంతర్నిర్మిత స్మార్ట్ పవర్ యాంప్లి ఫైయర్‌తో వస్తుంది, ఇది స్పష్టమైన మరియు స్ఫుటమైన సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 345mAh బ్యాటరీని మాగ్నెటిక్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో కలిగివుంది మరియు 10 రోజుల వరకూ బ్యాటరీ లైఫ్ ను అందించ గలదు.

ఈ స్మార్ట్ వాచ్ 100 కి పైగా స్టైలిష్ వాచ్ ఫేస్‌ లను కలిగి ఉంది మరియు 110+ స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. ఇది IP68 వాటర్ రెసిస్టెంట్‌ తో తగిన రక్షణ సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉంది. ఇక ఇది SpO2, హార్ట్  రేట్, ఒత్తిడి స్థాయిలు మరియు Sleep Quality లతో యూజర్ల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. ముఖ్యంగా, ఈ స్మార్ట్ వాచ్ స్టాండ్అలొన్ GPS మరియు Cywee యొక్క ప్రొఫెషనల్ GPS అల్గారిథమ్‌ను కలిగి ఉంది. తద్వారా, ఖచ్చితమైన శరీర కదలికలను రికార్డ్ చేయడానికి మరియు 20+ గంటల నిరంతర GPS తో కొనసాగుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :