Noise: పెద్ద 1.69 ఇంచ్ TFT డిస్ప్లేతో స్మార్ట్ వాచ్ లాంచ్..!

HIGHLIGHTS

Noise ఇండియాలో మరొక కొత్త స్మార్ట్ వాచ్ ను విడుదల చేసింది

ColorFit Caliber Go పెద్ద 1.69 ఇంచ్ TFT డిస్ప్లేతో తీసుకువచ్చింది

ఈ స్మార్ట్ వాచ్ 5 అందమైన కలర్ అప్షన్లతో అందించింది

ప్రముఖ కనెక్టెడ్ లైఫ్‌స్టైల్ టెక్ బ్రాండ్ Noise ఇండియాలో మరొక కొత్త స్మార్ట్ వాచ్ ను విడుదల చేసింది. అదే, ColorFit Caliber Go మరియు దీన్ని పెద్ద 1.69 ఇంచ్ TFT డిస్ప్లేతో తీసుకువచ్చింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ వాచ్ జెట్ బ్లాక్, రోజ్ పింక్, ఆలివ్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లూ మరియు మిస్ట్ గ్రే అనే 5 అందమైన కలర్ అప్షన్లతో అందించింది.  కలర్‌ఫిట్ కాలిబర్ గో కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్, gonoise.com మరియు ఫ్లిప్ కార్ట్ నుండి రూ. రూ. 1,999 ధరకు లభిస్తోంది.

ఇక ఈ Noise ColorFit Caliber Go ఫీచర్ల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ వాచ్ అంతర్నిర్మిత నాయిస్ హెల్త్ సూట్‌తో వస్తుంది మరియు హార్ట్ రేట్, యాక్టివిటీ లెవల్, నిద్ర విధానాలు, స్ట్రెస్ లెవల్ మరియు స్త్రీ ఆరోగ్య గుర్తులతో సహా మీ అన్ని ముఖ్యమైన విషయాలను ట్రాక్ చేయగలదు. ఈ స్మార్ట్ వాచ్ చేతులు కడుక్కోవడం, నీరు త్రాగడం, వంటి పనులకు అలారాలు వంటి రిమైండర్‌ లతో ఆరోగ్యకరమైన అలవాట్లను రూపొందించడంలో మీకు సహాయపడుతుంది.

మీ స్మార్ట్ ఫోన్ ను బయటకు తియ్యకుండానే మీరు కాల్‌ లను మ్యూట్ చేయడానికి, రిజక్ట్ చేయటానికి, సంగీతాన్ని రిమోట్‌గా నియంత్రించడానికి మరియు ఫైండ్ యువర్ ఫోన్ అప్షన్ కోసం కూడా మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 50 కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు మరియు 150 ప్లస్ క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్‌లను కూడా మీకు అందిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ మంచి బ్యాటరీ లైఫ్ మరియు స్టైలిష్ డిజైన్ సరితూకమని కూడా నోయిస్ పేర్కొంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :