Noise ColorFit Pro 6 Max launched with premium design and features
Noise ColorFit Pro 6 Max స్మార్ట్ వాచ్ ను ఈరోజు నోయిస్ విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ AI ఫీచర్ తో జతగా వచ్చింది మరియు ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా వచ్చింది. ఈ స్మార్ట్ వాచ్ బిల్ట్ ఇన్ GPS, స్విమ్మింగ్ ట్రాకింగ్ కోసం కూడా ఉపయోగపడేలా 5 ATM వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ వాచ్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
నోయిస్ కలర్ ఫిట్ ప్రో 6 మాక్స్ స్మార్ట్ వాచ్ ను రూ. 10,999 MRP ధరతో లాంచ్ చేసింది మరియు ఈరోజు రూ. 7,499 రూపాయల ఆఫర్ ధరకు అందించింది. ఈ స్మార్ట్ వాచ్ లెథర్, సిలికాన్ మరియు స్టెయిన్లెస్ స్టీల్ వేరియంట్లలో కూడా లభిస్తుంది.
Also Read: ఈరోజు అమెజాన్ నుంచి 18 వేల బడ్జెట్ లోనే 43 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!
నోయిస్ కలర్ ఫిట్ ప్రో 6 మాక్స్ స్మార్ట్ వాచ్ 1.96 ఇంచ్ AMOLED స్క్రీన్ ను 410 x 502 రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ బిల్డ్ తో వస్తుంది. ఇది రెగ్యులర్ మరియు AOD (ఆల్వేస్ ఆన్ డిస్ప్లే) తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 5 ATM వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ తో వస్తుంది.
ఈ స్మార్ట్ వాచ్ హార్ట్ రేట్, SpO2, స్లీప్ మోనిటర్, స్ట్రెస్ మోనిటర్ మరియు ఫిమేల్ సైకిల్ ట్రాకర్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ EN 2 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు నెబ్యులా UI 2.0 పై నడుస్తుంది. ఇందులో బిల్ట్ ఇన్ GPS మరియు AI సపోర్ట్ తో కూడా వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ఎమెర్జెన్సీ SOS, 100 పైగా స్పోర్ట్స్ మోడ్స్ మరియు BT వెర్షన్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ తో కూడా వస్తుంది.